365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఏప్రిల్ 29,2022: తెలంగాణ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారక రామారావు త్వరలో రానున్న తెలుగు శాటిలైట్ టీవీ ఛానెల్ స్వతంత్ర న్యూస్ ఛానెల్ లోగోను ఆవిష్కరిం చారు. ఈ కార్యక్రమంలో స్వంతంత్ర న్యూస్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్, ది పయనీర్ ఆంగ్ల దినపత్రిక రెసిడెంట్ ఎడిటర్ బి.కృష్ణప్రసాద్, స్వతంత్ర న్యూస్ ఛానల్ సంపాదకుడు తోట భావనారాయణ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఐఏఎస్, స్వతంత్ర ఛానల్ వైస్ ప్రెసిడెంట్ ముత్యాల సత్తిబాబు పాల్గొన్నారు.