365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,డిసెంబర్ 30, 2022: సీఎం కేసీఆర్.. కోడలు శైలిమ తండ్రి, మంత్రి కేటీఆర్ మామ పాకాల హరి నాథరావు కన్నుమూశారు. దీంతో దుఃఖంలో ఉన్న కోడలు శైలిమను సీఎం కేసీఆర్ ఓదార్చారు.
తన వియ్యంకుడు, మంత్రి కేటీఆర్ మామ పాకాల హరినాథరావు మృతిపట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. హైదరా బాద్ లోని రాయదుర్గం వద్ద గల వారి నివాసానికి వెళ్ళి హరినాథరావు భౌతిక కాయానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు.
తండ్రిని పోగొట్టుకున్న దుఃఖంతో ఉన్న తమ కోడలు శైలిమను, శోకతప్తులైన కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి దంపతులు ఓదార్చారు. హరినాథరావు ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం కేసీఆర్ భగవంతున్ని ప్రార్థించారు.