Nirmala-Sitharaman

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢిల్లీ, ఏప్రిల్ 6, 2023: ప్రధాని నరేంద్ర మోడీపై నిరాధార ఆరోపణలు చేస్తూ పదేపదే తప్పు చేస్తున్నారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు.

కేరళలోని కాంగ్రెస్ ప్రభుత్వం విజింగం ఓడరేవును అదానీ గ్రూపునకు పెద్దపీట వేసి అప్పగించిందని అన్నారు. ఎలాంటి టెండర్ తో పనిలేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆమె ఆరోయించారు.

కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాల్లో తప్పులు జరుగుతున్నా, వాటిపై రాహుల్ మాట్లాడడం లేదని నిర్మలా సీతారామన్ అన్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై విరుచుకుపడిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, “ఏదైనా తప్పు జరిగితే, అది కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాలలోనే జరుగుతోంది.

కానీ రాహుల్ గాంధీ దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడరు.. ప్రధాని, ఆర్‌ఎస్‌ఎస్‌పై వ్యాఖ్యానించిన విషయంలో రాహుల్ గాంధీ రెండుసార్లు లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పారని, నేడు తాను గాంధీనని, సావర్కర్‌ను కాదని ఆర్థిక మంత్రి అన్నారు.

Nirmala-Sitharaman

అరుణాచల్ ప్రదేశ్‌లోకి చైనీయులను ప్రభుత్వం అడ్డుకుంది: కేంద్ర మంత్రి

2019లో రాహుల్ గాంధీ రాఫెల్ ఆరోపణలపై ప్రకటన చేసినప్పుడు సుప్రీంకోర్టులో క్షమాపణ చెప్పాల్సి వచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అంతకు ముందు ఆర్‌ఎస్‌ఎస్‌పై తప్పుడు ప్రకటన ఇచ్చినందుకు లిఖిత పూర్వకంగా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.

ఈ రోజు మీరు (రాహుల్ గాంధీ) నేను గాంధీని, సావర్కర్‌ను కాదని అంటున్నారు. అతను క్షమాపణ చెప్పిన విషయం గుర్తుందా? మరోవైపు, అరుణాచల్ ప్రదేశ్‌లోకి చైనీయులను రాకుండా మా ప్రభుత్వం నిలిపివేసిందని ఆర్థిక మంత్రి తెలిపారు.