Sun. Sep 15th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆగస్టు 20,2024:తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లను అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం, రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, జిల్లా కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

భారీ వర్షాల నేపథ్యంలో వివిధ జిల్లాల్లో పరిస్థితిని సమీక్షించిన తరువాత, లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ప్రాంతాలలో చేపట్టవలసిన చర్యల గురించి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.వచ్చే ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో, ప్రజల జీవనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వర్ష సూచన, స్థానిక పరిస్థితుల ఆధారంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించే నిర్ణయాన్ని కలెక్టర్లు తీసుకోవాలని సూచించారు.

గత రాత్రి నుంచి గ్రేటర్ హైదరాబాద్, నిజామాబాద్ , ఇతర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినా, ప్రజలకు సాధ్యమైనంత మేరకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో మున్సిపల్, మెట్రో వాటర్ బోర్డు , ట్రాఫిక్ విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు.

error: Content is protected !!