
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తెలంగాణ, ఆగష్టు9,2021గత ప్రభుత్వాలు ఆదివాసీలను ఓటుబ్యాంకుగా చూసి రాజకీయాలు చేస్తే గత ఏడేళ్లుగా ముఖ్యమంత్రి కేసిఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో ఆదివాసీల సంస్కృతి పరిరక్షిస్తూ, సంక్షేమానికి పాటుపడుతూ, అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తున్నామని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అన్నారు. అటవీ బిడ్డల జీవన విధానానికి ప్రతీకగా, అడవితో తాము మమేకమైన అనుబంధాన్ని గుర్తు చేసే విధంగా నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం హైదరాబాద్ మసబ్ ట్యాంక్, దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో ఆదివాసీల గుస్సాడి, దింసా నృత్యాలతో కోళాహాలంగా, కన్నుల పండుగగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మీరాజ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్, ప్రత్యేక అతిధులుగా ఎమ్మెల్సీ ఎం.ఎస్ ప్రభాకర్ రావు హాజరయ్యారు.
కార్యక్రమంలో మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి కామెంట్స్…
• ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు
• 75 ఏళ్ల స్వాతంత్య్రం తరవాత అయినా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసిఆర్ గారి నాయకత్వంలో ఆదివాసీల జీవన ప్రమాణాలు పెరగాలని ప్రయత్నం చేస్తున్నాం.
• కొమురం భీమ్ ను స్మరిస్తూ 1994 నుంచి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నాం.
• ఈ ప్రభుత్వంలో ఆదివాసీ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేయడం, అందులో నేను భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను.
• గురుకులాల్లో చదువుకుని ప్రవేశ పరీక్షల్లో సీట్లు సాధించిన ప్రతిభ గల విద్యార్థులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తున్నాం.
• గతంలో ఆదివాసీల కష్టాలని వారి మానానికి వదిలేస్తే ఈ ప్రభుత్వం అన్ని తానై వారి సంస్కృతి పరిరక్షణ, సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
• గడిచిన 7 ఏళ్లుగా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అందరికీ సమానంగా సంక్షేమ పథకాలు అందివ్వాలని ప్రయత్నం జరుగుతుంది.

• గిరిజనులు రాష్ట్రంలో దాదాపు 10 శాతం ఉన్నారు. మా తండాలు, గూడాలలో మా రాజ్యం మాకు కావాలంటే ఏ పార్టీ పట్టించుకోకుండా ఓటు బ్యాంక్ గా చూస్తే సీఎం కేసిఆర్ గారు షుమారు 4000 తండాలను గ్రామ పంచాయతీలు చేసి, అక్కడ అన్ని వసతులు కల్పిస్తూ వాటి సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారు.
• 6 శాతంగా ఉన్న రిజర్వేషన్ల ను 10 శాతం పెంచేందుకు అసెంబ్లీలో తీర్మాణం చేసి కేంద్రానికి పంపారు.
• దళితులు, గిరిజనులకు కేటాయించిన నిధులు ఆ సంవత్సరంలో ఖర్చు చేయకపోతే వచ్చే సంవత్సరం ఖర్చు చేసే విధంగా చట్టం సవరించి వెసులుబాటు కల్పించారు.
• ఈరోజు ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాల్లో గిరిజన బిడ్డలు గొప్పగా లబ్ది పొందుతున్నారు.
• దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు ఇక్కడ అమలు చేస్తున్నారు. తద్వారా ఇక్కడి ప్రజల జీవితాల్లో వెలుగు వస్తుంది.
• మొన్ననే వాసాలమర్రిలో దళిత బంధు ప్రారంభం చేసుకున్నాం.
• దళితుల జీవితాలను వారే మార్చుకుని వెలుగు నింపే విధంగా దళిత బంధు పథకం ఉపయోగపడుతుంది.
• ఆదివాసీ ఆవాసాలకు వెంటనే 3 ఫేజ్ కరెంట్ ఇవ్వాలని ఆదేశించారు. 220 కోట్లు అవసరం అంటే వెంటనే ఆ నిధులు విడుదల చేశారు సీఎం కేసిఆర్ గారు.
• గురుకుల పాఠశాలల్లో లక్షల మంది గిరిజన బిడ్డలు నాణ్యమైన విద్య అభ్యసిస్తున్నారు.
• స్పోర్ట్స్ కోసం ప్రత్యేక కాలేజీలు ఉన్నాయి.
• దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ గిరిజనుల కోసం ప్రత్యేక ఐఏఎస్ స్టడీ సర్కిల్ కూడా ఉంది.
• ఆశ్రమ పాఠశాలలను తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకు తీసుకురావాలి.
• ప్రతి ఆదివాసీ, గిరిజన ఆవాసానికి రోడ్లు ఇస్తున్నాం.
• పోడు భూములకు త్వరలోనే పరిష్కారం చేస్తానని సీఎం కేసిఆర్ గారు హామీ ఇచ్చారు.
• పోడు భూములలో కూడా రైతు బందు ఇస్తున్నాం.
• 68,69 ఏళ్లు ఈ ప్రాంతాన్ని జాతీయ పార్టీలు పాలించాయి. గిరిజనుల మీద కపట ప్రేమ ఒలకబోశాయి.
• ఈ రాష్ట్రంలో ప్రతి అడుగు గురించి తెలిసిన వారు కేసిఆర్ గారు మనకు సిఎం కావడం మన అదృష్టం.
• గిరిపోషణ పథకాన్ని గత నాలుగేళ్లుగా గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖలు కలిసి అమలు చేస్తున్నాయి.
• సీఎం కేసిఆర్ గారి నాయకత్వంలో ఇక్కడున్న ప్రతి ఆదివాసీ బిడ్డకు న్యాయం జరుగుతుంది.

ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు గారి కామెంట్స్….
• గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి బాధ్యత అనంతరం గిరిజన శాఖలో చాలా మార్పు కనిపిస్తుంది.
• రాత్రి, పగలు తేడా లేకుండా అంతటా తిరుగుతూ చిత్తశుద్దితో మంత్రి కష్టపడుతున్నారు. ఆమెకు అభినందనలు చెప్తున్నాను.
• స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటినా దళిత జీవితాల్లో పెద్ద మార్పు లేదు. నామమాత్రంగా పథకాలు, డబ్బులు ఇచ్చారు.
• తెలంగాణ వచ్చాక, కేసిఆర్ గారు సీఎం అయ్యాక చాలా మార్పు వచ్చింది. దళితులు అభివృద్ధి కావాలని ఆయనలో ఒక తపన, కసి ఉంది. కచ్చితంగా వీరిని పైకి తీసుకురావాలి అని కృషిచేస్తున్నారు.
• గురుకులాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయో మనం చూస్తున్నాం.
• నేడు దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థల్లోని ప్రవేశ పరీక్షల్లో సీట్లు సాధించడం కంటే గొప్ప ఇంకేం కావాలి. సీఎం కేసిఆర్ గారు మద్దతు వల్లే ఇది జరిగింది.
• గిరిజన అధికారులు,సిబ్బంది కూడా అంకిత భావంతో పనిచేస్తున్నారు. అందువల్లే ఈ ఫలితాలు.
• గిరిజన, దళిత విద్యార్థులకు గురుకులాల్లో ఒక్కొక్కరికి లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నారు. మంచి విద్య, భోజనం, వసతులు కల్పిస్తున్నారు.
• ఐటీ రంగంలో మంచి ఉద్యోగాలు వచ్చే విధంగా శిక్షణ ఇస్తున్నారు.

ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ గారి కామెంట్స్…
• ఆదివాసీలకు ప్రత్యేక భాష, వస్త్రధారణ, సంస్కృతి ఉంది. వీరి అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతో చేస్తుంది…అయినా ఇంకా చాలా చేయాల్సి ఉంది.
• నిజంగా ప్రభుత్వం వీరికోసం చాలా చేస్తుంది. ఇది ఒక్కో అంశంగా చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.
• ఈ ఆదివాసీ బిడ్డలకు అవకాశాలు కల్పిస్తే ఎలాంటి ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు అనేది ఇక్కడికి వచ్చిన వారిని చూస్తే అర్థం అవుతుంది.
• దేశంలోని గొప్ప ప్రవేశ పరీక్షల్లో సీట్లు సాధించి ఎవరికీ తక్కువ కాదు అని నిరూపిస్తున్నారు.
• జి. ఓ నంబర్ 3ని కొట్టివేయడం వల్ల గిరిజనులు ఇబ్బందిపడుతున్నారు. త్వరలో ఈ జీవోను మళ్ళీ పునరుద్దరణ జరుగుతుంది అని ఆశిస్తున్నాం.
• ట్రైబల్ స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేస్తే మన బిడ్డలు ఒలింపిక్ కు కూడా వెళ్తారు.
నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మీరాజ్ గారి కామెంట్స్….
• మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు
• ప్రపంచంలో ప్రజలందరూ ఎలా నియమబద్ధంగా జీవించాలి అని ఆదివాసీల నుంచి నేర్చుకోవాలి.
• వీరిని మనం గొప్పగా సన్మానించుకోవాలి.
• పట్టణంలో జీవించే మాకు ఈ కార్యక్రమం ద్వారా ఆదివాసీ జీవన విధానం, సంస్కృతి గురించి తెలిసింది.
గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు గారి కామెంట్స్…

• మన రాష్ట్రంలో 32 లక్షల మంది గిరిజన జనాభా, 32 తెగలు ఉన్నాయి. ఇందులో 4 అంతరించిపోతున్న ఆదివాసీ తెగలు(పీవీటీజీ) ఉన్నాయి.
• ఈ ప్రజల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి మంచి సహకారం అందుతుంది. ఆర్థిక ఇబ్బందులూ లేవు.
• ఆదివాసీలలో అందరూ బాగుపడాలి ఏ ఒక్కరినీ వదలకూడదు అనేది ఈ ఏడాది థీమ్.
• గిరిజన ఆవాసాలన్నింటికి 3ఫేస్ కరెంట్, రోడ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
• వివిధ గిరిజన, ఆదివాసీ భాషల్లో పుస్తకాలు రూపొందించి మాతృ భాషలో బోధన చేస్తున్నాం.
• 74 గిరిజన రైతు ఉత్పత్తి సంఘాలు ఏర్పాటు చేశాం. ఒక్కొదానిలో 400 మంది సభ్యులుగా ఉంటారు.
• సీఎం ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్ షిప్ పథకం కింద పారిశ్రామిక వేత్తలు చేయడం వల్ల గిరిజన ప్రగతి వేగంగా జరుగుతుంది.
• 5000 మందిని గత ఏడాది ఈ.జీ.ఎం.ఎం ద్వారా ప్రోత్సహించాము.
• ఈ ఏడాది కూడా మరింత మందికి చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం.
• మహిళా పారిశ్రామిక వేత్తలు తయారు చేయడం కోసం వి.హబ్ తో ఒప్పందం చేసుకున్నాం.
• కొత్తగా పారిశ్రామికవేత్తలు చేయడం కోసం 200 డి.పి.ఆర్ లు సిద్దంగా ఉన్నాయి.

కార్యక్రమంలో ఆదివాసీల చరిత్రను తెలియజేస్తూ, భవిష్యత్ పరిరక్షించే విధంగా నాలుగు పుస్తకాలను మంత్రి , ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, అధికారులు ఆవిష్కరించారు.
1.గిరిజన వైద్యం -ఇది ఆదివాసీ సంస్కృతుల యందు వృక్షజాలం కు సంబందించిన సాంప్రదాయ విజ్ఞానం తో సహజంగా లభించే వన మూలికలల్తో వైద్య విధానం వివరించడం జరిగింది.
- కోయ సాంప్రదాయక ఆహారం మరియు వంటకాలు-కోయ సంస్కృతీ యందు వివిధ కాయగూరలు, ఆకుకూరలు, విత్తనాలు, పుట్టగొడుగుల వంటి ఆహారపదార్థాల ఆవశ్యకత
- తోటి తెగ పచ్చబొట్లు అను పుస్తకం నందు తోటి సంస్కృతిలో పచ్చబొట్లకు గల ప్రాముఖ్యత మరియు వివిధ సందర్భాలలో పచ్చబొట్ల రీతులులను వర్ణించడం జరిగింది.
- గోండి మరియు కోయ పదకోశం నిగంటు వులు -గోండి మరియు కోయ బాష లను ఔత్సాహిక భాష వేత్తలకు ఉపయోగ కరంగా రూపొందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆదివాసీల అభ్యున్నతి కోసం పనిచేసిన గొప్ప వారిని సన్మానించారు.

10 మంది గిరిజన పారిశ్రామిక వేత్తలకు సీఎం ఎస్టీ ఎంటర్ ప్రెన్యుర్ షిప్ పథకం కింద 4.4 కోట్ల చెక్ అందించారు.
అటవీ నుంచి నాణ్యమైన తేనె ను ఉత్పత్తి చేసే వారికి 90 లక్షల విలువైన తేనె సేకరణ ఉపకరణాలు అందించారు.
గురుకులాల్లో చదువుతూ దేశంలో ప్రముఖ ప్రవేశ పరీక్షల్లో సీట్లు సాధించిన 183 మంది విద్యార్థులకు ల్యాప్ టాప్ లు అందించడంలో భాగంగా వేదిక మీద నేడు 10 మంది ఆదివాసీ విద్యార్థులకు ల్యాప్ టాప్ లు అందించారు.
కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన భోజనంలో ఆదివాసీల జొన్న, రాగి, సజ్జ, సామల గట్కలు, ఇప్ప పూవు బజ్జీలు, లడ్డూలు, అడవీ ప్రాంత ఆకులు, కూరగాయలు, చేపలతో కూరలు, పులుసులు చేసి వడ్డించారు.
ఈ కార్యక్రమంలో పద్మశ్రీ గుస్సాడి కనకరాజు, గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి, నవీన్ నికోలస్, సంయుక్త సంచాలకులు సముజ్వల, కళ్యాణ్ రెడ్డి, విజయలక్ష్మి, లక్ష్మి ప్రసాద్, గిరిజన మ్యూజియం క్యూరేటర్ డాక్టర్ సత్యనారాయణ, జి. సీ. సి జనరల్ మేనేజర్ సీతారాం నాయక్, చీఫ్ ఇంజనీర్ శంకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.