365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,ఫిబ్రవరి16,2023: తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో “ఫ్లై హై టూరిజం” ఆధ్వర్యంలో రూపొందించిన వెబ్ సైట్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టామని తెలిపారు.
అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున విదేశీ, స్వదేశీ పర్యాటకులు రాష్ట్రానికి తరలి వస్తున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం పర్యాటకుల స్వర్గధామంగా తీర్చిదిద్దుతున్నామని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అనేక చారిత్రక ,వారసత్వ, ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన అనేక పర్యాటక ప్రదేశాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయన్నారు. తెలంగాణ పర్యాటక ప్రదేశాలకు అంతర్జాతీయ స్థాయిలో ప్రమోషన్ ను నిర్వహించి రాష్ట్రానికి పర్యాటకులను ఆకర్షిస్తూన్నమని ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఫ్లై హై టూరిజం నిర్వాహకులు యశ్ పాల్ వీరగోని, సోనియా తదితరులు పాల్గొన్నారు.