Mon. Dec 23rd, 2024
vemula-prashanth-reddy

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, వేల్పూర్,ఏప్రిల్ 5,2023: తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి టెన్త్ ఎగ్జామ్ పేపర్ లీక్ ఘటనపై స్పందించారు. బాల్కొండ నియోజకవర్గంలో బుధవారం ఆయన పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పదోతరగతి పరీక్షల పేపర్ల లీక్ లపై మాట్లాడారు.

“10వ తరగతి పేపర్ లీక్ సూత్రదారి బీజేపీ బండి సంజయేనని, అందుకు సంబంధించిన అన్ని రకాల ఆధారాలు లభించాయని “ఆయన చెప్పారు.

“లక్షల మంది పిల్లలు భవిష్యత్తు,వారి తల్లి తండ్రుల ఎంత బాధ పడతారు..?అనే కనీస బాధ్యత లేకుండా బండి సంజయ్ ప్రవర్తించాడు, కేసిఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే బీజేపీ ప్రధాన ఉద్దేశం” అని ప్రశాంత్ రెడ్డి అన్నారు.

vemula-prashanth-reddy

“ప్రశాంత్ అనే వ్యక్తి బండి సంజయ్ కి ఫోటో తీసిన పేపర్ ఫోన్లో పంపిండు, పరీక్ష మొదలైన 15 నిమిషాల్లోనే బండి సంజయ్ కు ప్రశాంత్ ద్వారా వచ్చింది. బండి సంజయ్,బీజేపీ వాళ్ళతో 140 సార్లు ఫోన్లో మాట్లాడిండు ప్రశాంత్, వాళ్లే ఉద్దేశ పూర్వకంగా లీక్ చేస్తారు.. వాళ్లే మీడియాకి పంపిస్తారు” అని మంత్రి మండిపడ్డారు.

“పేపర్ లీక్ అయ్యింది..ఆ పేపర్ నాకు వచ్చింది.. ప్రభుత్వం విఫల మయ్యింది అని ప్రచారం చేస్తారు. ఇది పిల్లల జీవితాలతో చెలగాటం ఆడటమేనని, బండి సంజయ్ పాత్ర ఉన్నది పోలీసుల వద్ద ఆధారాలు ఉన్నాయి..చట్టం తనపని తాను చేసుకుపోతుంది.” అని మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.

vemula-prashanth-reddy

“బండి అరెస్ట్ పై బీజేపీ నాయకులు కేసిఆర్ దిష్టి బొమ్మ దహనం చేస్తే ఖబర్దార్…భౌతిక దాడులు తప్పవు అని హెచ్చరించారు. పేపర్ లీక్ చేసి పిల్లల భవిష్యత్ ను నాశనం చేయాలని చూసిన బీజేపీ బండి సంజయ్ వైఖరి పట్ల బీజేపీ కార్యకర్తలు ఆలోచన చేయాలి.” అని ఆయన అన్నారు.

error: Content is protected !!