Sat. Nov 9th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 2,2024: శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో, స్వామి వారి మూలవిరాట్టును సూర్యకిరణాలు నేరుగా తాకాయి. ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది.

ఉదయం 6:05 గంటలకు, సుమారు 6 నిమిషాల పాటు భక్తులకు కనువిందు చేసిన ఈ అద్భుతం, లేలేత సూర్యకిరణాల స్పర్శతో దేదీప్యమానంగా వెలుగొందింది. ప్రతి సంవత్సరం దక్షిణాయనంలో అక్టోబర్ 1, 2 తేదీలలో, ఉత్తరాయణంలో మార్చి 9, 10 తేదీలలో స్వామి వారి మూల విరాట్‌ను నేరుగా తాకాయి సూర్యకిరణాలు. వాతావరణం సరిగా లేకపోవడం వల్ల గత రెండేళ్లుగా కనిపించలేదు.

ఈసారి, రెండు సంవత్సరాల అనంతరం, అరసవిల్లి క్షేత్రంలో స్వామి వారి మూల విరాట్టును రెండు రోజులు వరుసగా సూర్యకిరణాలు తాకడం, భక్తులకు ఆనందాన్ని కలిగించింది. ఈ ఘట్టాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు అరసవిల్లి క్షేత్రానికి పోటెత్తారు.

error: Content is protected !!