365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, తెలంగాణ, భారత్ జూన్ 1,2025 : సౌందర్యం, సామాజిక సేవ, పర్యావరణ పరిరక్షణ, గ్లోబల్ సిస్టర్‌హుడ్ భావాలను ప్రపంచానికి చాటిచెప్పిన చారిత్రక ఘట్టానికి హైదరాబాద్ వేదికైంది. తెలంగాణ రాజధానిలోని హిటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరిగిన ప్రతిష్టాత్మక 72వ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలేలో థాయ్‌లాండ్‌కు చెందిన ఓపల్ సుచతా చువాంగ్‌స్రీ విశ్వసుందరి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు.
ఈ ఘన విజయం థాయ్‌లాండ్‌కు మొట్టమొదటి మిస్ వరల్డ్ టైటిల్‌ను అందించగా, ఈ పోటీలో ప్రపంచం నలుమూలల నుంచి 108 మంది సుందరాంగులు సాంస్కృతిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, ఆతిథ్య పరంపరలను ప్రదర్శిస్తూ, రాష్ట్రం మళ్లీ ఒకసారి గ్లోబల్ సాంస్కృతిక వేదికగా నిలిచింది.
భారతదేశంలో ఇది మూడోసారి (1996, 2024 తరువాత) మిస్ వరల్డ్ ఫెస్టివల్ జరగడం విశేషం. తెలంగాణ ప్రభుత్వం, మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా ఈ వేడుకలను ఏర్పాటు చేయగా, రాష్ట్రానికి పెద్దస్థాయిలో అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది.
ఇది కూడా చదవండి…ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సీనియర్ అసిస్టెంట్ సీతాలక్ష్మి పదవీ విరమణ
ఇది కూడా చదవండి…వరద సమస్య పరిష్కారం కోసం హైడ్రా, జీహెచ్ఎంసీ సంయుక్త పరిశీలన..

గ్రాండ్ ఫినాలే సాయంత్రం కలల ప్రపంచాన్ని, విభిన్నతను, మహిళా సాధికారతకు ప్రతిరూపాన్ని చూపించినట్లు నిలిచింది. ఒపాల్ సుచతా చువాంగ్‌స్రీ విజయం తెలంగాణ వేదికపై చరిత్రలో నిలిచిపోతుంది. ఈ గ్రాండ్ ఈవెంట్‌లో తెలంగాణ సంప్రదాయాలు, ఆధునికత, అతిథి సత్కారం ప్రపంచానికి పరిచయమయ్యాయి.
ప్రత్యేకతలు..
- 72వ మిస్ వరల్డ్ పోటీ విజేత: ఒపాల్ సుచతా చువాంగ్‌స్రీ (థాయ్‌లాండ్)
-ప్రైజ్ మనీ: సుమారు ₹8.5 కోట్లు
-కిరీటం విలువ: ₹6.21 కోట్లు (నీలం, టర్కాయిస్ సఫైర్లు, ముత్యాలతో అలంకరణ)
-108 మంది సుందరాంగనులు పాల్గొన్న పోటీ
-భారత్‌లో మూడోసారి మిస్ వరల్డ్ ఫెస్టివల్ 1996, 2024 తరువాత2025.