365తెలుగు డాట్ కామ్ న్యూస్, ఏప్రిల్ 23,2025: బాలీవుడ్‌లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచే చిత్రాల్లో మిథున్ చక్రవర్తి నటించిన ‘డిస్కో డాన్సర్’ (1982) ఒకటి. కేవలం 2 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.
బబ్బర్ సుబాష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, డిస్కో సంగీతం, మిథున్ చక్రబర్తీ డ్యాన్స్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. బప్పీ లాహిరీ స్వరపరిచిన ‘ఐ యామ్ ఎ డిస్కో డాన్సర్’, ‘జిమ్మీ జిమ్మీ’ వంటి పాటలు ఆ రోజుల్లో యువతను ఉర్రూతలూగించాయి. ఈ సినిమా భారత్‌లోనే కాకుండా విదేశాల్లో, ముఖ్యంగా సోవియట్ యూనియన్‌లో విపరీతమైన ఆదరణ పొందింది.
ఇది కూడా చదవండి…పహల్గామ్ దాడి తర్వాత పాకిస్థాన్‌లోమొదలైన వైమానిక దాడుల భయం..
ఇది కూడా చదవండి…₹12,800 కోట్లతో రెండు అణు రియాక్టర్లు నిర్మించనున్న ఎంఈఐఎల్..
Also read this…Airtel to Acquire 400 MHz Spectrum in 26 GHz Band from Adani Data Networks..
ఇది కూడా చదవండి…బతుకమ్మ కుంటలో అభివృద్ధి పనులకు కమిషనర్ శంకుస్థాపన..

ఈ చిత్రం బడ్జెట్‌తో పోలిస్తే 50 రెట్లకు పైగా లాభాలను ఆర్జించి, ఆ రోజుల్లోనే అరుదైన రికార్డును సృష్టించింది. మిథున్ చక్రవర్తి నటన, డ్యాన్స్‌తో ఈ సినిమా తనదైన గుర్తింపును సంపాదించింది. ఈ విజయం బాలీవుడ్‌లో డిస్కో ట్రెండ్‌కు బీజం వేసిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.