365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, జూలై 2,2025: భారతీయ వినియోగ దారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ మివి, వినూత్న సాంకేతికతకు మరో అడుగు వేసింది. భావోద్వేగంగా తెలివైన ఏఐ ప్లాట్‌ఫామ్‌తో కూడిన మివి ఏఐ బడ్స్ ను మంగళవారం విడుదల చేసింది. ఈ బడ్స్, మానవ తరహా సహజ సంభాషణలతో వినియోగదారుల అనుభవాన్ని మరింత విస్తృతం చేయనున్నాయి.

స్క్రీన్ లేకుండా..

భారతదేశంలోనే రూపకల్పన, తయారీ చేసిన ఈ ఏఐ బడ్స్, స్క్రీన్ అవసరం లేకుండా వినియోగదారులతో సహజ సంభాషణను కల్పిస్తాయి. సాధారణ ఏఐల మాదిరిగా కాకుండా, మివి ఏఐ, జ్ఞాపకశక్తి, సందర్భం, వ్యక్తిగతీకరణ ఆధారంగా అభివృద్ధి చెందుతూ, మానవ సహచరుడిలా స్పందిస్తుంది.

ఏభాషలోనైనా..

ఇది హిందీ, తెలుగు, తమిళం, బెంగాలీ, మరాఠీ, కన్నడ, మలయాళం, గుజరాతీ భాషల్లో ఎటువంటి సెట్ మార్పులు లేకుండా సహజంగా స్పందించగలదు.

విభిన్న అవతార్‌లు..

డొమైన్-స్పెసిఫిక్ గురు, ఇంటర్వ్యూయర్, చెఫ్, వెల్‌నెస్ కోచ్, న్యూస్ రిపోర్టర్ వంటివి ఈ బడ్స్‌లో ఉన్న ప్రత్యేక అవతార్‌లుగా పనిచేస్తాయి.

లాంగ్ బ్యాటరీ లైఫ్..

ఒకసారి చార్జ్ చేస్తే 40 గంటల వరకు పనిచేయగల శక్తివంతమైన బ్యాటరీ సామర్థ్యం, హవర్ గ్లాస్ డిజైన్, చక్కని ఆడియో ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా ఉన్నాయి.

మివి ప్రతినిధి మాట్లాడుతూ…సంస్థ సహ వ్యవస్థాపకురాలు అండ్ సిఎంఓ మిధుల దేవభక్తు మాట్లాడుతూ, “మా ఏఐ బడ్స్ కేవలం ఒక గ్యాడ్జెట్ కాదు, ఇది భారతదేశానికి ఒక ప్రగతిశీల సాంకేతిక విజయం. మేము జాతీయ స్థాయిలో ఏఐ అభివృద్ధికి రూ. 2,000 కోట్లు వెచ్చించనున్నాము. భారతదేశం కోసం, ప్రపంచం కోసం సృష్టించిన ఆవిష్కరణ ఇది,” అని వివరించారు.

ధర, లభ్యత..

రూ. 6,999కి ఫ్లిప్‌కార్ట్, మివి వెబ్‌సైట్‌లో ఈ ఏఐ బడ్స్ అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది. అదనంగా, వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మివి ఏఐ యాప్ను గూగుల్ ప్లే స్టోర్‌లో ఉంచారు.