365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఖమ్మం,మార్చి 7, 2023: దేశ సంపద సమానంగా అందించాలన్నదే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అని సీఎల్పీ నాయకులూ ,మధిర ఎమ్మెల్యే భట్టీ విక్రమార్క అన్నారు.
మామునూరులోని రూ16లక్షల వ్యయంతో నిర్మించిన హెల్త్ సబ్ సెంటర్ ను, రాజుల దేవరపాడు గ్రామంలో మన ఊరు-మనబడి స్కీంలో భాగంగా అదనపు గదులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా అయ్యవారిగూడెం గ్రామంలో ఏర్పాటుచేసిన సమావేశంలో భట్టీ విక్రమార్క మాట్లాడుతూ..ఇది కాదు కదా మనం కోరుకున్న అభివృద్ధి అని, ఆస్తులన్నీ ఆదాని, అంబానీలకే మోడీ దోచిపెడుతున్నారని ఆరోపించారు.
గ్యాస్ సిలిండర్ ధర పెంచారని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో రూ.500కే గ్యాస్ ధర తగ్గిస్తామని ఆయన అన్నారు. బిఆర్ఎస్ పార్టీ పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందించలేదని, పంట పండించే రైతుకు మాత్రమే కాదు తమ పాలనలో భూమిలేని రైతులకు రూ.7వేలు అందించే ప్రయత్నం చేస్తామని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన అనంతరం విద్య వ్యవస్థపై చిన్న చూపు చూస్తుందని, గ్రామాల అభివృద్ధికి విద్య, వైద్యం అందిస్తేనే ఆ రాష్ట్రం ఆ దేశం బాగుంటుందని భట్టీ అన్నారు. అనంతరం అదే గ్రామంలో ఎన్ఆర్ఈఎస్ నిధులతో నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఎర్రుపాలెం జడ్పిటిసి కవిత, ఎంపీటీసీ ప్రవల్లిక, మండల పిఆర్ఏఈ నరేష్, మండల తాసిల్దార్ తిరుమల చారి, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంఈఓ ప్రభాకర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, మామునూరు సర్పంచ్ మోహనరావు, మధిర మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.