Sun. Oct 6th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అక్టోబర్ 28,2023: ఎమ్మెల్సీ కవిత.. ట్విట్టర్ లో ఆసక్తికర కామెంట్ చేశారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉండే ఎమ్మెల్సీ కవిత.. (X)ట్విట్టర్ వేదికగా స్పందించారు.

మినిస్టర్ కల్వకుంట్ల తారకరామారావు ఆయన చెల్లి కవిత చిన్నప్పుడు దిగిన పిక్ ను బీఆర్ఎస్ లీడర్ అర్వింద్ అలిశెట్టి పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ కు ఎమ్మెల్సీ కవిత రియాక్ట్ అయ్యారు.

మంత్రి కేటీఆర్ ను ఉద్దేశిస్తూ ‘ఆయన చాలా బాధ్యతాయుతమైన వ్యక్తి. ఆయనతో నా చిన్ననాటి నుంచి ఎన్నో మధురానుభూతులు ఉన్నాయి. వాటిని వర్ణించలేను. ఇది కరెక్ట్ కదా..! అన్నయ్య’ అంటూ కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్ కు ట్యాగ్ చేశారు ఆమె.

error: Content is protected !!