Fri. Nov 22nd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైద‌రాబాద్‌, డిసెంబ‌ర్19, 2023: హైద‌రాబాద్ ఆటో, టాక్సీ డ్రైవ‌ర్ల సంఘం భార‌త‌దేశంలోనే తొలిసారిగా, ర‌వాణా రంగాన్ని పున‌ర్నిర్వ‌చించేలా రైడ్ బుకింగ్ యాప్ అయిన యారీని ప్రారంభించింది. యారీ భారతదేశంలోనే మొట్ట‌మొద‌టి డ్రైవర్-సెంట్రిక్ యాప్ గా నిలుస్తుంది.

ఆటో-హెయిలింగ్ ను త‌న మొద‌టి మొబిలిటీ సర్వీస్ గా, హైదరాబాద్ ప్రజలకు సేవలందించే అదనపు సేవలకు రోడ్ మ్యాప్ గా అందిస్తుంది. ఓఎన్డీసీ ప్రోటోకాల్స్ ఆధారంగా రూపొందిన ఈ ప్రత్యేక ప్లాట్ ఫామ్ ఆటో, టాక్సీ డ్రైవర్ల సాధికారతకు ప్రాధాన్యత ఇస్తుంది. జీరో కమీషన్ తో పనిచేస్తూనే, వారికి త‌మ‌ వ్యాపారంపై పూర్తి నియంత్రణను అందిస్తుంది.

హైదరాబాద్ లో 20,000 మంది ఆటో, ట్యాక్సీ డ్రైవర్లను విజయవంతంగా ఆన్ బోర్డ్ చేసిన యారీ పలు నగరాల్లోని వివిధ డ్రైవర్ సంఘాలతో కలిసి ఇలాంటి మొబిలిటీ యాప్ లను ఆవిష్క‌రిస్తోంది. భారతదేశం అంతటా రాబోయే ఆరు నెలల్లో 1,00,000 మందికి పైగా డ్రైవర్లను ఆన్ బోర్డ్ చేయడం, రెండు మిలియన్ల మందికి పైగా వినియోగదారులకు సేవలు అందించాలనే ప్రతిష్ఠాత్మక లక్ష్యంతో, యారీ మొబిలిటీ రంగాన్ని పునర్నిర్వచించడానికి సిద్ధంగా ఉంది.

యారీ వినియోగదారులు, సర్వీస్ ప్రొవైడర్లు (ఆటో & టాక్సీ డ్రైవర్లు) మధ్య లావాదేవీలను 0% కమీషన్‌తో సులభతరం చేస్తుంది. సర్వీస్ ప్రొవైడర్లకు నామమాత్రపు సాస్ ఫీజును మాత్రమే వసూలు చేస్తుంది. ఇది సాంప్రదాయ రైడ్-హెయిలింగ్ అగ్రిగేటర్ల కంటే 10 రెట్లు తక్కువ. ఇది డ్రైవర్లకు న్యాయమైన, పారదర్శక ఆదాయ నమూనాను నిర్ధారిస్తుంది.

డ్రైవర్లకు సరళమైన పని వేళ‌లు, ప్రతిస్పందించే మద్దతు వ్యవస్థ, డ్రైవర్, కుటుంబానికి బీమా, న్యాయ‌ప‌ర‌మైన కన్సల్టింగ్ మద్దతును యారీ అందిస్తుంది. ఈ ప‌రిశ్ర‌మ‌లో ఇలా చేయ‌డం ఇదే మొద‌టిసారి. డ్రైవర్ సంక్షేమం విష‌యంలో ఈ ప్లాట్‌ఫాం నిబద్ధత ప్ర‌స్తుతం ఉన్న మోడ‌ళ్ల‌కు చాలా విభిన్నంగా ఉంటుంది. వినియోగదారుల కోసం, యారీ సరసమైన ధరలలో నమ్మదగిన, బహుళ-మోడల్ మొబిలిటీ సేవను మెరుగైన కస్టమర్ అనుభవం, సమర్థతతో అందిస్తుంది.

యారీలో చేరడానికి, ఆటో లేదా టాక్సీ డ్రైవర్లు ప్లే స్టోర్ నుంచి యారీ పార్టనర్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వారి మొబైల్ నంబర్, ఆర్‌సీ,మడ్రైవింగ్ లైసెన్సుతో కూడిన ఇబ్బంది లేని కేవైసీ ధ్రువీక‌ర‌ణ‌ను పూర్తి చేయవచ్చు. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ ద్వారా ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్లలో యారీ రైడ్‌ను వినియోగదారులు కూడా ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

వినియోగదారులు, డ్రైవర్లలో ప్రబలంగా ఉన్న ఆందోళనలను యారీ సమర్థవంతంగా పరిష్కరిస్తుంది. కారు అందుబాటులో లేకపోవడం, విశ్వసనీయమైన సేవలు, ఇతర ప్లాట్‌ఫాంలు విధించే అధిక కమీషన్ల లాంటి సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాన్ని అందిస్తుంది.

నిజమైన బహుళ-నమూనా మొబిలిటీ సేవలను అందించడానికి బలమైన నిబద్ధతను ప్రదర్శిస్తూ, యారీ తన వినియోగదారులకు, ఓఎన్డీసీ నెట్‌వ‌ర్క్ భాగస్వాములకు మధ్యవర్తుల అవసరాన్ని తొలగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒకే యాప్ ద్వారా వైవిధ్యమైన మొబిలిటీ సేవలను అందిస్తూ, వినియోగదారులకు ప్రజా రవాణాను క్రమబద్ధీకరించాలనే ఉద్దేశ్యంతో యారీ ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక మెట్రోలతో ఒప్పందాలు కుదుర్చుకుంది.

ఈ సహకార విధానం డ్రైవర్ల సంపాదన సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా వినియోగదారులకు మొదటి, చివరి మైలు కనెక్టివిటీని సులభతరం చేస్తుంది. భారతదేశంలోని నగరాలు, పట్టణాలు లేదా గ్రామాలలో రవాణా సజావుగా ఉండి, ఎక్కువ ఖ‌ర్చు కాకుండా, స‌మ‌యాన్ని ఆదా చేసేలా, అదే స‌మ‌యంలో ఇటు వినియోగ‌దారుల‌కు, అటు స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌కు కూడా మంచి విలువ‌ను అందించేందుకు ఒక మంచి భ‌విష్య‌త్తును యారీ అందిస్తుంది.

డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దిగ్గజాలు హరి ప్రసాద్, మదన్ బాల సుబ్రమణియన్, పరితోష్ వర్మలు యారీని స్థాపించారు. ఓపెన్ సోర్స్ బెక్కన్ ప్రోటోకాల్ ఆధారంగా ఓఎన్డీసీ (భారత ప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వ శాఖ చొరవ) నిర్దేశించిన స్థాపిత నెట్ వర్క్ ప్రమాణాల ఆధారంగా దీనిని నిర్మించారు.

కోషి టి, ఎండీ & సీఈఓ, ఓఎన్డీసీ (ఓపెన్ నెట్‌వ‌ర్క్ ఫర్ డిజిటల్ కామర్స్)
“డిజిటల్ వాణిజ్యాన్ని ప్రజాస్వామ్యీకరించడానికి ఓఎన్డీసీ కట్టుబడి ఉంది. ఈ మిషన్లో ఒక కీలకమైన అంశం.. మొబిలిటీ సేవలను పెంచడం. వివిధ యాప్‌ల సొంత వ్యాపారాసక్తుల‌తో సంబంధం లేకుండా ఈ ఓపెన్ మొబిలిటీ నెట్‌వ‌ర్క్ డ్రైవర్లు మరియు సర్వీస్ ప్రొవైడర్లకు జీవనోపాధి మార్గాన్ని అందించడంతో పాటు సాధికారత కల్పిస్తుంది.

డిజిటల్ చెల్లింపుల కోసం యూపీఐ, ఎన్‌పీసీఐ త‌మ ల‌క్ష్యాల‌ను సాధించిన‌ట్లే.. ఓఎన్డీసీ అలాంటి విజయాన్ని మొబిలిటీ రంగంలో పునరావృతం చేయాలని కోరుకుంటోంది. డీపీఐఐటీ, మోర్త్ విభాగాల బలమైన మద్దతుతో టైర్ 1, టైర్ 2 నగరాల్లో దీన్ని అందుబాటులోకి తేవడమే మా లక్ష్యం. యారీ ప్రారంభోత్సవం ఈ కార్యక్రమం దేశవ్యాప్త వృద్ధికి స్పష్టమైన నిదర్శనంగా నిలుస్తుంది. హైదరాబాద్ లోని సర్వీస్ ప్రొవైడర్లకు, కస్టమర్లకు అత్యంత చౌకైన, లాభదాయకమైన సేవలను అందిస్తామని హామీ ఇస్తున్నాం.”

సుజిత్ నాయ‌ర్, సీఈఓ, ఫిడే (ఫౌండేష‌న్ ఫ‌ర్ ఇంట‌ర్‌పోర్ట‌బులిటీ ఇన్ డిజిట‌ల్ ఎకాన‌మీ)“వాణిజ్యం కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) ఇంటర్నెట్ మాదిరిగానే పనిచేస్తుంది. ఫిడే నుంచి అందించే బెక్న్ ప్రోటోకాల్ అటువంటి జనాభా స్థాయిలోనే డీపీఐని దేశవ్యాప్తంగా ప్రారంభించడానికి వీలు కల్పిస్తుంది.

ఒక సాధారణ ప్రమాణాన్ని అవలంబిస్తూ, వివిధ కొనుగోలుదారు అప్లికేష‌న్లు వినియోగదారులకు మొబిలిటీ సేవలను అందించగలవు. ఇవి సర్వీస్ ప్రొవైడర్లకు మ‌రింత డిమాండ్ సామర్థ్యాన్ని సృష్టిస్తాయి. బెక్న్ ప్రోటోకాల్ పై నిర్మించిన ఓఎన్డీసీ, ఈ రీచ్ ను పెంచుతుంది, ముఖ్యంగా మెట్రోలు, బస్సుల్లాంటి ప్రజా రవాణా సేవల సహకారంతో, ఇది వినియోగదారులకు అసాధారణంగా విలువైనదిగా మారుతుంది.”

మ‌హేష్ గౌడ్, ఐఎన్‌టీయూసీ ఆటో యూనియ‌న్, హైద‌రాబాద్‌

“యారీతో, మేము మా సొంత యాప్‌ను ప్రారంభిస్తున్నాము. న‌గ‌రంలో ఇప్ప‌టికే 15,000 మందికి పైగా డ్రైవర్లు దీనికి సైన్ అప్ చేశారు. అగ్రిగేటర్ మోడ‌ళ్లు, అధిక ఖర్చులతో విసిగిపోయిన డ్రైవర్లు మరింత స్వతంత్రంగా, థర్డ్ పార్టీ ప్లేయర్లపై తక్కువ ఆధారపడే పరిష్కారాల కోసం చూస్తున్నారు.

ప్రయాణికులకు మెరుగైన, విశ్వసనీయమైన సేవలను అందించడానికి మాకు సాధికారత కల్పిస్తూ, మా అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ డ్రైవర్ల కోసం యారీ రూపొందింది. సంతోషకరమైన డ్రైవర్ సంతృప్తి చెందిన ప్రయాణికుడికి సమానం అని మేము నమ్ముతున్నాము. దీన్ని నిజం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము.”

నంద‌కిషోర్, బీఎంఎస్ ఆటోయూనియ‌న్, హైద‌రాబాద్‌

“యారీ ప్రారంభోత్సవం హైదరాబాద్ లోని ట్యాక్సీ, ఆటో డ్రైవర్లకు ఒక ముఖ్యమైన మైలురాయి. స్వతంత్రత, న్యాయమైన పరిహారం అనే భాగస్వామ్య దార్శనికతతో, యారీ మా డ్రైవర్లకు భారీ కమీషన్ల పరిమితులు లేకుండా, వారి వ్యాపారాన్ని నియంత్రించే అద్భుతమైన వేదికను అందిస్తుంది.

ఇది పరిశ్రమలో ఒక కొత్త మలుపును సూచిస్తుంది. మా డ్రైవర్ల శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా, మా విలువైన ప్రయాణికులకు మెరుగైన, నమ్మదగిన రవాణా సేవలను అందించే సేవలో భాగం అయినందుకు మేము గర్విస్తున్నాము. రైడ్-హెయిలింగ్ పర్యావరణ వ్యవస్థలో మరింత స్థిరమైన, డ్రైవర్-అనుకూల‌ భవిష్యత్తు వైపు సానుకూల మార్పుల‌కు యారీ నిజంగా ఒక ప్రతీక.”

హ‌రిప్ర‌సాద్‌, సీఈఓ, స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు, యారీ

“డ్రైవర్ల కోసం.. డ్రైవర్లతో యారీ రూపొందింది. రైడ్-హెయిలింగ్ పర్యావరణ వ్యవస్థకు శక్తినిచ్చే డ్రైవర్లు అత్యంత గౌరవం, మద్దతు, న్యాయమైన పరిహారానికి అర్హులనే ప్రధాన నమ్మకంతో దీన్ని రూపొందించాం. డ్రైవర్ల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడానికే యారీ ప్లాట్‌ఫాం సిద్ధ‌మైంది.

అంతిమంగా ప్రయాణికులకు ఉన్నత స్థాయి అనుభవం, విశ్వసనీయతను ఇది అందిస్తుంది. ఓపెన్ నెట్ వర్క్ తో వారి సొంత నిబంధనలపై నిమగ్నం కాగల వైవిధ్యమైన మొబిలిటీ, ట్రావెల్ & ట్రాన్స్ పోర్ట్ ప్లేయర్లను ఏకతాటిపైకి తీసుకురావడమే ఇక్కడ మా లక్ష్యం. యారీని భారతదేశం అంతటా విస్తరించాలని చూస్తున్నందున హైదరాబాద్ ప్రారంభం మాత్రమే.”

error: Content is protected !!