365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, 11 డిసెంబర్ 2025: ది కంఫర్ట్ టెక్నాలజీ కంపెనీ® స్కెచర్స్, హైదరాబాద్‌లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్‌లో భారత ఫాస్ట్ బౌలర్‌ మొహమ్మద్ సిరాజ్‌తో తమ తొలి ఫ్యాన్ మీట్ & గ్రీట్ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించింది. స్కెచర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సిరాజ్ స్వస్థలమైన హైదరాబాద్‌లో ఇదే మొదటి ఫ్యాన్ ఈవెంట్ కావడంతో, అభిమానులకు తమ ప్రియమైన స్థానిక హీరోను ప్రత్యక్షంగా కలుసుకునే అరుదైన అవకాశం లభించింది.

భారత క్రికెట్‌లో అత్యంత ప్రభావం చూపుతున్న పేసర్లలో ఒకరిగా ఎదిగిన సిరాజ్‌ను చూడటానికి భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈ ఈవెంట్‌లో అభిమానులు సిరాజ్‌తో మాట్లాడటమే కాకుండా, సరదా కార్యకలాపాల్లో పాల్గొని, ప్రత్యేకంగా రూపొందించిన ఉత్సాహభరిత అనుభవాన్ని ఆస్వాదించారు. అభిమానులపై సిరాజ్‌ చూపే ప్రేమను ప్రతిబింబించేలా కార్యక్రమం మొత్తం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.

స్కెచర్స్ సౌత్ ఆసియా ప్రైవేట్ లిమిటెడ్ సిఇఒ రాహుల్ విరా మాట్లాడుతూ,
“హైదరాబాద్‌కు మొహమ్మద్ సిరాజ్‌ తో ఉన్న అనుబంధం ప్రత్యేకం. స్కెచర్స్ కుటుంబంలో ఈ నగరానికి చెందిన ఈ స్పీడస్టర్ ఉండటం మాకు గర్వకారణం. అతని శక్తి, నిబద్ధత, ప్రేరణాత్మక ప్రయాణం స్కెచర్స్ సిద్ధాంతాలకు అద్దం పడుతుంది. ఈ మీట్ & గ్రీట్ ద్వారా అభిమానులు సిరాజ్‌ను కలవడంతో పాటు, మా సరికొత్త కంఫర్ట్-టెక్ ఆధారిత కలెక్షన్‌లను అన్వేషించే అవకాశం పొందారు” అని తెలిపారు.

మొహమ్మద్ సిరాజ్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ,
“హైదరాబాద్ అంటే నాకు ఇల్లు. ఇక్కడ అభిమానులను కలవడం ఎప్పుడూ ప్రత్యేకమే. స్కెచర్స్‌తో నా భాగస్వామ్యం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది సౌకర్యం, పనితీరం, ప్రామాణికతను ప్రతిబింబించే బ్రాండ్. అభిమానుల ప్రేమ, ప్రోత్సాహానికి నేను కృతజ్ఞుడిని. స్కెచర్స్‌తో కలిసి మరిన్ని మంచి క్షణాలు పంచుకోవాలని ఎదురుచూస్తున్నాను” అని చెప్పారు.

శరత్ సిటీ క్యాపిటల్ మాల్‌లోని స్కెచర్స్ స్టోర్ ఇటీవల 1800 చదరపు అడుగుల నుంచి 5500 చదరపు అడుగులకు విస్తరించబడింది. పెరుగుతున్న వినియోగదారుల డిమాండ్ కారణంగా జరిగిన ఈ అప్‌గ్రేడ్‌తో, మరింత విశాలమైన మరియు అనుభవాత్మక రిటైల్ స్పేస్‌ను అందిస్తున్నారు. ఈ స్టోర్‌లో బ్రాండ్ సిగ్నేచర్ కంఫర్ట్ టెక్నాలజీతో కూడిన లైఫ్‌స్టైల్, పనితీరు ఆధారిత విస్తృత కలెక్షన్‌లు అందుబాటులో ఉన్నాయి.

ఈ ఈవెంట్‌కు వచ్చిన అభిమానులు పరుగు, నడక, శిక్షణ, స్పోర్ట్స్ స్పెషాలిటీ, లైఫ్‌స్టైల్ వంటి విభాగాల్లో స్కెచర్స్ కొత్త కలెక్షన్‌లను ప్రత్యేకంగా వీక్షించారు. పురుషులు, మహిళలు, పిల్లల కోసం ఫుట్‌వేర్, దుస్తులు, యాక్సెసరీలు—అన్నింటిలో తాజా డిజైన్లు, ఆధునాతన ఆవిష్కరణలు ఒకే చోట అందుబాటులో ఉన్నాయి.