365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,డిసెంబెర్ 31,2025: తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత కీలకమైన ‘తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ (TFCC) నూతన కార్యవర్గ ఎన్నికల్లో నిర్మాత మోహన్ వడ్లపట్ల కీలక బాధ్యతలు చేపట్టారు. 2025–2027 కాలపరిమితికి గాను ఆయన సంయుక్త కార్యదర్శిగా (Joint Secretary) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఇటీవల జరిగిన ఈ ఎన్నికల్లో ఆయన ‘మన ప్యానల్’ తరపున నిర్మాతల విభాగం నుంచి ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా విజయం సాధించారు. అనంతరం జరిగిన కార్యవర్గ ఎంపికలో అందరి ఆమోదంతో సంయుక్త కార్యదర్శి పదవిని దక్కించుకున్నారు.
Read this also: Mohan Vadlapatla Secures Unanimous Win as Joint Secretary of Telugu Film Chamber..
Read this also:Hyderabad’s Deepa Jewellers Files for IPO to Raise Up to Rs.250 Crore..
ఈ సందర్భంగా మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ.. తనపై నమ్మకముంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో దిల్ రాజు అధ్యక్షతన పనిచేసిన అనుభవం తనకు ఉందని, ఇప్పుడు సీనియర్ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు నాయకత్వంలోని కమిటీలో భాగం కావడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమ సమస్యల పరిష్కారానికి, నిర్మాతల సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు.

నూతన కార్యవర్గ వివరాలు (2025–2027):
తెలుగు చిత్ర పరిశ్రమలోని నిర్మాణం, పంపిణీ, ప్రదర్శన విభాగాలను సమన్వయం చేసే ఈ నూతన కమిటీలో ముఖ్య సభ్యులు వీరే:
అధ్యక్షుడు: దగ్గుబాటి సురేష్ బాబు
ఉపాధ్యక్షులు: నాగవంశీ, భరత్ చౌదరి
కార్యదర్శి: అశోక్ కుమార్
సంయుక్త కార్యదర్శి: మోహన్ వడ్లపట్ల
కోశాధికారి: ముత్యాల రాందాస్

పరిశ్రమ వర్గాల హర్షం
ఇదీ చదవండి :Oral cancer : నోటిలో పుండు క్యాన్సర్‌కు దారితీస్తుందా..?
Read this also: Dr. Sonia Datta Calls for a “Total Body” Oral Wellness Revolution in 2026..
మోహన్ వడ్లపట్ల ఏకగ్రీవ ఎన్నికపై సినీ ప్రముఖులు ,తోటి నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు ఉన్న అనుభవం, పరిశ్రమ పట్ల ఉన్న నిబద్ధత ఫిల్మ్ ఛాంబర్ అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని పలువురు నిర్మాతలు ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ నూతన కార్యవర్గం 2027 వరకు పదవిలో కొనసాగనుంది.
