365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, సెప్టెంబర్ 16, 2024: న్యూఢిల్లీకి చెందిన మాన్ సూన్ లగ్జరీ సెలూన్, హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో తన మొదటి శాఖను గ్రాండ్‌గా ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా హనుమాన్ సినిమా ఫేమ్ హీరో తేజ సజ్జా పాల్గొన్నారు.
మాన్ సూన్ సెలూన్ ఈ నెలంతా అన్ని బ్యూటీ సర్వీసులపై 30% డిస్కౌంట్ అందిస్తోంది. పురుషులు, మహిళలు, పిల్లల కోసం విస్తృతమైన సౌందర్య సేవలు అందించబడతాయి. కెరాస్టాస్ ఉత్పత్తులతో సహా, అత్యున్నత స్థాయి ఉత్పత్తులను ఉపయోగించి నిపుణులు సేవలు అందిస్తారు.
ప్రత్యేక సభ్యత్వాలతో మరిన్ని అదనపు ప్రయోజనాలు..అద్భుతమైన పార్కింగ్ సౌకర్యం.. విశాలమైన, సౌకర్యవంతమైన వాతావరణం.. ఈ ప్రారంభోత్సవం లో మాన్ సూన్ సెలూన్ మేనేజింగ్ డైరెక్టర్ శుభి జొహారీ, టెర్రా ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ఎండీ అర్జున్ గుండవరం అతిథులు పాల్గొన్నారు. నమకా ఎంటర్ ప్రైజెస్ ఎండీ, మాన్ సూన్ సెలూన్ ఫ్రాంచైజీ యజమాని అభిషేక్ గుండవరం మాట్లాడుతూ, “మాన్ సూన్ సెలూన్‌ను హైదరాబాద్‌కు పరిచయం చేయడం సంతోషంగా ఉంది.
ఇది కొత్త ప్రమాణాలను ఏర్పాటు చేయడానికి, నగరానికి అనుగుణంగా అధిక స్థాయి అనుభవాన్ని అందించడానికి ఒక దశ అయినందున, మేము దీన్ని సంతోషంగా తీసుకుంటున్నాం” అని అన్నారు. కొత్త సేలూన్ ఆధునిక డిజైన్, అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలను అందిస్తూ, వినియోగదారులకు అత్యుత్తమ సేవలను అందించడానికి కట్టుబడి ఉందని సెలూన్ నిర్వాహకులు చెబుతున్నారు. https://monsoonsalon.com/