365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నేషనల్,ఆగస్టు 21,2024:123 ఏళ్ల చరిత్ర గల ప్రతిష్టాత్మక మురుగప్ప గ్రూప్‌లో భాగమైన అధునాతన ఈవీ బ్రాండ్ మోంట్రా ఎలక్ట్రిక్ తమ 5000వ త్రీ వీలర్ ప్యాసింజర్ ఆటో (L5M కేటగిరీ)ని డెలివరీ చేసినట్లు వెల్లడించింది.
వాహనాన్ని ప్రవేశపెట్టిన ఏడాది వ్యవధిలోనే ఈ కీలక మైలురాయిని అధిగమించినట్లు వివరించింది. నవకల్పనలు, సస్టెయినబిలిటీ, సాంకేతికత పురోగతితో పాటు దేశవ్యాప్తంగా కస్టమర్లతో పటిష్టమైన సంబంధాలను ఏర్పర్చుకోవడంలో తమకు గల నిబద్ధతకు ఈ ఘనత నిదర్శనమని తెలిపింది.
కేవలం ఏడాది వ్యవధిలోనే మార్కెట్లో మోంట్రా ఎలక్ట్రిక్ తన స్థానాన్ని పటిష్టం చేసుకుంది. 17 రాష్ట్రాలవ్యాప్తంగా 74 మార్కెట్లలోని కస్టమర్లకు 5000 సూపర్ ఆటోలను డెలివర్ చేసింది. బ్రాండ్ వేగవంతమైన వృద్ధికి, అధునాతన ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ల ఆమోదయోగ్యతకు ఈ అసాధారణ ఘనత నిదర్శనంగా నిలవగలదు.
“ప్రవేశపెట్టిన ఏడాది వ్యవధిలోనే గణనీయ స్థాయిలో 5000 సూపర్ ఆటోల డెలివరీ మైలురాయిని సాధించడం మాకెంతో గర్వకారణం. భారత్‌లో ఎలక్ట్రిక్ మొబిలిటీ విప్లవానికి సారథ్యం వహించడంలో మోంట్రా ఎలక్ట్రిక్‌నకు గల నిబద్ధతకు ఈ ఘనత ఒక నిదర్శనం.
దీన్ని సాకారం చేసిన మా విలువైన కస్టమర్లు, డీలర్ పార్ట్‌నర్లు, సరఫరాదారులు మరియు మొత్తం మోంట్రా ఎలక్ట్రిక్ టీమ్‌నకు ధన్యవాదాలు” అని మోంట్రా ఎలక్ట్రిక్ 3Ws బిజినెస్ హెడ్ రాయ్ కురియన్ తెలిపారు.
మోంట్రా ఎలక్ట్రిక్ సూపర్ ఆటోతో లాస్ట్-మైల్ ట్రాన్స్‌పోర్టేషన్‌లో మోంట్రా ఎలక్ట్రిక్ విప్లవాత్మకమైన మార్పులు తెస్తోంది. డిజైన్, వైశాల్యం, ఆకర్షణీయమైన 203 కి.మీ. రేంజీ (ఏఆర్ఏఐ సర్టిఫైడ్)పరంగా సూపర్ ఆటో ఈ విభాగంలో తన ప్రత్యేక ముద్ర వేసింది. ఇంధన ఆదాను మెరుగుపర్చేందుకు, సిటీ ట్రాఫిక్‌లో సులువుగా కదిలేందుకు పార్క్ అసిస్ట్ మోడ్‌తో పరిశ్రమలోనే తొలిసారి మల్టీ-డ్రైవ్ మోడ్‌లను ఈ వాహనం పరిచయం చేసింది.
ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమలో దిగ్గజంగా స్థానాన్ని పటిష్టం చేసుకునే క్రమంలో త్రీ-వీలర్ గూడ్స్ సెగ్మెంట్‌లోకి కూడా ప్రవేశించేందుకు మోంట్రా ఎలక్ట్రిక్ సిద్ధమవుతోంది.#MontraElectric #EVRevolution #ElectricVehicles #SustainableTransport #ThreeWheeler #SuperAuto #MurugappaGroup #ElectricMobility #CleanTransportation #Innovation #MilestoneAchievement #LastMileConnectivity #GreenTechnology #203kmRange #ElectricThreeWheeler #ParkAssist #DrivingChange #FutureOfTransport #MakeInIndia #EcoFriendly