Tue. Jan 7th, 2025 11:28:47 AM

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మే 2,2023: మీరు ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతి చిన్న దేశం గురించి విని ఉండకపోవచ్చు. ప్రపంచంలో చాలా చిన్న దేశం ఒకటి ఉంది. దానికి ప్రత్యేక కరెన్సీ కూడా ఉంది.

అంతేకాదండోయ్..ఈ దేశం కేవలం రెండు స్తంభాలపైనే ఉంటుంది. దీని పేరు “ది ప్రిన్సిపాలిటీ ఆఫ్ సీలాండ్. ఇది ఇంగ్లాండ్ నుంచి10 నుంచి12 కిలోమీటర్ల దూరంలో సముద్రం మధ్యలో ఉంది. ఈ దేశంలో నివసిస్తున్న మొత్తం ప్రజల సంఖ్య 24.

అవును, ఇక్కడ 24 మంది మాత్రమే నివసిస్తున్నారు. ఈ దేశం ఫుట్‌బాల్ మైదానం కంటే తక్కువ విస్తీర్ణంలో ఉంటుంది. అయితే వారికి సొంతంగా ఫుట్‌బాల్ జట్టు కూడా ఉంది. ఇది కాకుండా ఈ దేశానికి దాని స్వంత రాజ్యాంగం,జెండా కూడా ఉంది. దేశాన్ని ప్రపంచంలోని అనేక దేశాలు కూడా గుర్తించాయి.

సీలాండ్‌ను ఒకప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ రాయల్ నేవీ ఉపయోగించింది. జర్మన్ దాడులను ఎదుర్కోవడానికి సీలాండ్‌ను బ్రిటిష్ వారు ఉపయోగించారు. కానీ 1967లో ప్యాడీ రాయ్ బేట్స్ అనే బ్రిటీష్ వ్యక్తి ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకుని, తన రేడియో స్టేషన్‌ను అక్రమంగా నడపడం ప్రారంభించాడు. ఇది కాకుండా, అతను ఈ స్థలాన్ని సార్వభౌమ రాజ్యంగా ప్రకటించాడు.

గత 50 దశాబ్దాలుగా పాలన..

గత 50 సంవత్సరాలుగా, అతని కుటుంబం ఈ “మైక్రోనేషన్” ను నిజమైన దేశంగా మార్చింది. ఐతే ప్రపంచంలోని కొన్నిదేశాలు దీనిని అధికారికంగా గుర్తించలేదు. సీలాండ్‌ను దేశంగా పరిగణించే చాలా దేశాలు ప్రపంచంలో ఉన్నాయి.

నేడు సీలాండ్ దాని స్వంత రాజ్యాంగాన్ని దాని స్వంత జెండాను కలిగి ఉంది. దాని స్వంత అధికారిక నినాదం “E Mare, Libertas” అంటే “సముద్రం నుంచి స్వేచ్ఛ” కూడా ఉంది” అని అర్థం.

ఇంత చిన్న దేశం సీలాండ్‌కు ఆశ్చర్యకరమైన సుదీర్ఘ చరిత్ర ఉంది. ఉనికిలో ఉన్న గత ఐదు దశాబ్దాలలో ఈ మైక్రోనేషన్ రాజ మరణాలు, బందీల పరిస్థితులు, ప్రాదేశిక వివాదాలు, హెలికాప్టర్ యుద్ధాలను కూడా చూసింది. కానీ నేటికీ అది ప్రపంచంలో తన ఉనికిని కొనసాగిస్తోంది.

error: Content is protected !!