365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మే 6,2022:అమ్మ…! ఆ పదంలో ఆప్యాయత, అనురాగం, ఆనందం, ఆత్మీయత,ఆదర్శం, కమ్మదనం, తీయదనం ఇంకా ఎన్నెన్నో… ఎంత చెప్పినా తక్కువే.. మాటలకు అందని అమ్మ ప్రేమను చాటి చెప్పే మాతృదినోత్సవం రోజున మహిళామూర్తులకు టి.ఎస్.ఆర్టీసీ బోనాంజా ప్రకటించింది. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలతో ప్రయాణించే తల్లులు మాత్రమే అన్ని బస్ సర్వీస్‌లలో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తుంది.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ యాజమాన్యం మదర్శ్ డే శుభాకాంక్షలు తెలుపు తూ మే 8 (ఆదివారం) రోజున మాతృమూర్తులు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవ చ్చని వెల్లడించింది. ఈ సందర్భంగా సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎం.ఎల్.ఎ గారు, వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వి.సి.సజ్జనార్, ఐ.పి.ఎస్ గారు మాట్లాడు తూ, తన త్యాగపు పునాదులపై.. మన జీవిత సౌదాన్ని నిర్మించిన ఆ మాతృమూర్తుల
సేవలు విశిష్టమైనవని కొనియాడారు.
అమ్మ అనురాగాన్ని, ప్రేమను వెలకట్టలేమంటూ ఆ త్యాగమూర్తి సేవలను గుర్తించు కుని మదర్శ్ డే ని పురస్కరించుకుని వారికి ప్రత్యేకంగా ఉచిత ప్రయాణ సదుపా యాన్ని కల్పించడం జరుగుతుందన్నారు. ఐదేళ్లలోపు పిల్లలతో ప్రయాణించే తల్లులందరూ పల్లె వెలుగు నుంచి ఏసీ సర్వీసుల వరకు అన్ని బస్సులలో ఆ రోజున ఈ ఉచిత ప్రయాణాన్ని కొనసాగించవచ్చని స్ఫష్టం చేశారు. టి.ఎస్.ఆర్టీసీ సామాజిక దృక్ఫథంతోనూ అడుగు ముందుకేస్తోందని, ఇలాంటి ప్రత్యేక సందర్భాలలో ప్రత్యేక
రాయితీలు కూడా కల్పిస్తున్న వైనాన్ని వారు గుర్తు చేశారు.మాతృదినోత్సవం రోజున టి.ఎస్.ఆర్టీసీ కల్పిస్తున్న ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.