365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఫిబ్రవరి 6, 2025: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU) ,ఇండో క్లైమేట్ సెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య గురువారం ఒక అవగాహన ఒప్పందం కుదిరింది.

ఈ ఒప్పందంపై విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ G.E. చ. విద్యాసాగర్, ఇండో క్లైమేట్ సెన్స్ ప్రతినిధి రామచంద్ర సంతకాలు చేసి, ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకున్నారు.

ఈ కార్యక్రమం PJTSAU రాజేంద్రనగర్ ఆవరణలోని అగ్రి హబ్ కార్యాలయంలో, విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ ఆల్దాస్ జానయ్య సమక్షంలో జరిగింది. నేలలోని పోషకాల స్థాయిలను గుర్తించే సెన్సార్ టెక్నాలజీ అభివృద్ధి దిశగా రెండు సంస్థలు కలిసి పనిచేయడానికి ఈ ఒప్పందం తోడ్పడనుంది.

ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకులు డాక్టర్ M. బలరాం, సెంటర్ ఫర్ నేచురల్ రిసోర్సెస్ అండ్ ఎన్విరాన్మెంట్ సంచాలకులు డాక్టర్ K.P. వాణి, నేలల ఆరోగ్యం & యాజమాన్యం విభాగాధిపతి డాక్టర్ A. మాధవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.