Sun. Dec 22nd, 2024
MOVERS--365t

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, డిసెంబర్ 31, 2022: అమెరికాతోపాటు భారతదేశం కేంద్రంగా మూవర్స్ అండ్ ప్యాకేజింగ్ సేవలు అందిస్తున్న మూవర్స్ డాట్ కామ్ (movers.com) 20వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వార్షికోత్సవవేడుకలను హోటల్ దస్పల్లాలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా movers.com సీఈఓ విద్యాధర్ గారపాటి మాట్లాడుతూ, ఎన్ ఆర్ ఐ సాధించిన అతికొద్ది విజయాల్లో ఇది ఒకటని అన్నారు. మాములుగా ప్రారంభమై ఇప్పుడు 75 సిబ్బంది ఉన్న కంపెనీగా ఎదిగింది.

మూవర్స్ డాట్ కామ్ భారతీయ కార్యకలాపాలలో మరో 50 మంది సిబ్బందిని జోడించాలని యోచిస్తోందని అన్నారు.

అంతేకాకుండా భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు తన కార్యకలాపాలను విస్తరించాలని కూడా యోచిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

మూవర్స్ డాట్ కామ్ గత 20 సంవత్సరాలలో 3.5 మిలియన్ల వినియోగ దారులకు సేవలందించింది. ప్రస్తుతం ఈ కంపెనీ 20-మిలియన్ డాలర్ల టర్నోవర్‌కి చేరుకుంది.

ఇప్పుడు దీని లక్ష్యం 252 మిలియన్ల డాలర్లుగా ఉంది. ప్రతి నెలా 7000 మంది కస్టమర్లకు సేవలందిస్తున్నామని మూవర్స్ డాట్ కామ్ సీఈఓ విద్యాధర్ గారపాటి తెలిపారు.

కొన్నేళ్లలో తమ దృష్టిని లీడ్ అగ్రిగేటర్ నుంచి రీలొకేషన్ మేనేజ్‌మెంట్ కంపెనీకి మార్చడంపై దృష్టి పెడుతుందని, ప్రతి సంవత్సరం అమెరికాలో దాదాపు 32 నుంచి 35 మిలియన్ల కదలికలు ఉంటాయని, ఎదో కారణ రీత్యా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మారుతూ ఉంటారు.

గత 20 ఏళ్లలో కేవలం 3.5 మిలియన్ల కస్టమర్లను మాత్రమే పొందాము, ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు.

అమెరికాలో సగటు వ్యక్తి తన జీవితకాలంలో దాదాపు 11.7 సార్లు ఒక ప్రదేశం నుంచిఇంకొక ప్రదేశానికి మారుతూ ఉంటారు. అందుకోసం 3వేల డాలర్లకు పైగా ఖర్చు చేస్తారు.

MOVERS--365t

మేము నెలకు15000 లీడ్‌లను పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీని నుంచి మేము 35శాతం లీడ్‌లనుంచి వినియోగదార్లుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన అన్నారు.

ప్రతి సంవత్సరం7000 మంది కస్టమర్‌లను పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ఒక్కొక్కరు 3000 డాలర్లు చెల్లిస్తే, మేము రాబోయే నాలుగేళ్లలో 252 డాలర్ల మిలియన్ల టర్నోవర్‌ను సాధించగలుగుతామని విద్యాధర్ గారపాటి వెల్లడించారు.

బీమా, గృహ గృహ భద్రత మొదలైన సేవలలోకి ప్రవేశించనున్నట్లు ఆయన తెలిపారు. తమ సంస్థ ‘ప్రతి రోజు కొత్త రోజు, మొదటి నుంచి ప్రారంభించండి’, అనే నినాదంతో ముందుకెళుతుందని, ప్రతి ఒక్క కస్టమర్‌ను కొత్త కస్టమర్‌గా పరిగణిస్తామని, రాబోయే నాలుగేళ్లలో ఐపీవో లక్ష్యంగా పెట్టుకుంటామని విద్యాధర్ గారపాటి ప్రకటించారు.

Movers.com అమెరికన్ మూవింగ్ అండ్ స్టోరేజ్ అసోసియేషన్ (AMSA) అండ్ బెటర్ బిజినెస్ బ్యూరో (BBB)లో మెంబర్ . వైరస్ అండ్ మాల్వేర్ రక్షణలో గ్లోబల్ లీడర్ అయిన McAfee ద్వారా మా వెబ్‌సైట్ ధృవీకరించిందని, హ్యాకింగ్ ,ఫ్రాడ్ గురించి అస్సలు భయం ఉండదని ఆయన వెల్లడించారు.

error: Content is protected !!