365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,మార్చి 29,2022:

గ్రీన్ఇండియా చాలెంజ్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్ లో మొక్కలు నాటిన సినీ నటుడు తరుణ్…ఈ సందర్భంగా తరుణ్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు.పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్ చొరవ తీసుకొని ఈ కార్యక్రమం చేపట్టడం అభినందనీయం అని అన్నారు.ఇప్పటివరకు కోట్ల మొక్కలు గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా నాటారని చాలా గొప్ప విషయమని అన్నారు.గ్రీనరి పెంచేందుకు ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరిన తరుణ్…