Sun. Dec 22nd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి9, 2024: టాటా ఐపీఎల్ 2024 సీజన్‌ అందించే క్రికెట్ విందును ఆస్వాదించేందుకు అభిమానులు సిద్ధమవుతున్న నేపథ్యంలో, జియో సినిమా దీన్ని మరో ఉత్తేజకరమైన ఎడిషన్‌గా మార్చేందుకు తన ప్రచారాన్ని ప్రారంభించింది.

ఈ క్యాంపెయిన్‌లో రెండు సినిమాలు ఉండగా, మొదటి దానిలో ఎంఎస్ ధోని ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ మూడు వాణిజ్య ప్రచార చిత్రాలు టాటా ఐపీఎల్‌ను డిజిటల్‌లో వీక్షించే సామూహిక ఉత్సాహాన్ని తెలియజేస్తాయి.

గత సీజన్‌లో జియో సినిమాలో రికార్డు స్థాయిలో 449 మిలియన్ల మంది వీక్షించిన టాటా ఐపీఎల్‌తో పాటు డిజిటల్‌లో క్రీడల ప్రత్యక్ష ప్రసారాలను చూడాలని కోరుకుంటున్న వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ఈ క్యాంపెయిన్‌ను రూపొందించారు.

ది స్క్రిప్ట్ రూమ్ అందించిన కాన్సెప్ట్‌కు ఎర్లీ మ్యాన్ ఫిల్మ్స్ చిత్రరూపాన్ని ఇచ్చింది. ఇందులో ఎంఎస్ ధోని తాత, మనవడిగా ద్విపాత్రల్లో కనిపిస్తారు. ఇది ఒక సరదా కథనాన్ని కలిగి ఉంటుంది.

తన ఫోన్ స్క్రీన్‌పై మనవడు టాటా ఐపీఎల్ మ్యాచ్‌ను తదేకంగా వీక్షిస్తూ ఉంటాడు. తాత కూడా తన ఫోన్‌లో అదే మ్యాచ్‌ని చూస్తూ ఉంటాడు. అదే సమయంలో తాత తన ఛాతీలో అసౌకర్యంగా ఉన్నట్లు కనిపిస్తాడు.

అంబులెన్స్‌లో ఆసుపత్రికి వెళుతున్న సమయంలో అక్కడి మెడికల్ అటెండెంట్ కూడా తన ఫోన్‌లో ఆటను చూస్తూ ఉంటాడు.

తాతామనవళ్లు నవ్వుకుంటూ వ్యాన్ వెనుక భాగంలో హాయిగా కూర్చుని మ్యాచ్ చూస్తూ ఉంటారు. తాత తేగడంతో కథనంలో మార్పు వస్తుంది.

ఆయనకు అసౌకర్యం కేవలం గ్యాస్‌తోనే వచ్చిందని గుర్తిస్తారు. అప్పుడే మ్యాచ్‌లో ఆటగాడు ఒక సిక్సర్ కొడతాడు. దీంతో ఆ చిత్రానికి తెరపడుతుంది.

ఈ క్యాంపెయిన్ టీవీ, డిజిటల్, సోషల్ మీడియా ,ప్రింట్‌లో త్వరలో అందుబాటులోకి రానుంది.

జియో సినిమా క్రియేటివ్ మార్కెటింగ్ హెడ్ షగున్ సెడా మాట్లాడుతూ, ‘‘ఈ క్యాంపెయిన్ ఇటీవలి కాలంలో వీక్షకుల మధ్య మనం చూసిన అతిపెద్ద వినియోగ మార్పుకు అనుగుణంగా ఉంటుంది.

ఎందుకంటే వారు తమ రోజువారీ లైవ్ స్పోర్ట్స్ యాక్షన్‌ను వీక్షించేందుకు సంప్రదాయ విధానాల నుంచి డిజిటల్‌కి మారారు’’ పేర్కొన్నారు.

‘Sab Yahaan, Aur Kahaan!’ అనే సెంటర్ ట్యాగ్‌లైన్ టాటా ఐపిఎల్‌ను డిజిటల్‌లో వీక్షించేందుకు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారని విశదీకరిస్తుంది.

జియో సినిమా ప్రపంచంలోనే అతిపెద్ద టి20 టోర్నమెంట్‌ను సరసమైన ధరలో అందుబాటులోకి తీసుకురావడంతో పాటు భాషా పరమైన ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్రసారం చేస్తూ వస్తుంది.

యాక్షన్‌లో ఎంఎస్ ధోనీని ప్రతి నిమిషాన్ని ఆరాధించే అభిమానుల అభిరుచికి అనుగుణంగా, సృజనాత్మకతతో మేము దీన్ని రూపొందించాము’’ అని తెలిపారు.

‘‘ఇది మాకు కేవలం క్యాంపెయిన్ కన్నా ఎక్కువ. పెద్ద ఏజెన్సీ అధిపతులు దీన్ని ‘‘ఆదేశం’’గా వ్యవహరిస్తారు. ‘Sab Yahaan, Aur Kahaan!’ అనే ప్రధాన ఆలోచనను నుంచి జియో సినిమా బృందంతో కలిసి పనిచేయడం, పలు చిత్రాలకు స్క్రిప్ట్ సిద్ధం చేయడం, ప్రొడక్షన్ టీమ్‌తో మమేకమై పని చేస్తూ, దాని ద్వారా వీక్షించడం.

ఒక తీవ్రమైన, మానసికంగా సంతోషకరమైన ప్రయాణం’’ అని ది స్క్రిప్ట్ రూమ్ వ్యవస్థాపకుడు అయ్యప్పన్ పేర్కొన్నారు. “జియో సినిమా బృందం చూపించిన విశ్వసనీయత, సహృదయతకు కృతజ్ఞతలు.

వారు మమ్మల్ని ఉత్తమ సృజనాత్మక అవుట్‌పుట్ వచ్చేలా ప్రోత్సహించినందుకు మాకు చక్కని సంతోషాన్ని ఇస్తోంది. మేము పూర్తి చేసిన పని పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. అలాగే ప్రతి ఒక్కరూ దీన్ని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాము’’ అని తెలిపారు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎంఎస్ ధోనికి చెందిన చెన్నై సూపర్ కింగ్స్ 2024 మార్చి 22న తలపడనుండగా, దక్షిణాది డెర్బీతో జియోసినిమాలో టాటా ఐపీఎల్ 2024 ప్రారంభమవుతుంది.

వీక్షకులకు హరియాణీని మొదటిసారిగా పరిచయం చేస్తుండగా, 12 భాషల్లో 4కెలో తాజా సీజన్‌ను ఉచితంగా వీక్షించేందుకు అవకాశం ఉంటుంది. మొదటిసారి హీరో క్యామ్‌తో సహా మల్టీ-క్యామ్ ఎంపికలు, జీతో ధన్ ధనా ధన్‌తో సహా మరెన్నో ఫ్యాన్స్ ఎంగేజ్‌మెంట్ ఫీచర్‌లను వినియోగదారులు ఆస్వాదించవచ్చు.

వీక్షకులు జియోసినిమా (iOS & Android)ని డౌన్‌లోడ్ చేసుకుని తమ అభిరుచి ఉన్న క్రీడలను వీక్షించవచ్చు. తాజా అప్‌డేట్‌లు, వార్తలు, స్కోర్‌లు,వీడియోల కోసం, అభిమానులు Facebook, Instagram, Twitter, YouTube,WhatsAppలో ,Sports18లో Facebook, Instagram, Twitter ,YouTube ద్వారా జియో సినిమాను ఫాలోకావచ్చు.

error: Content is protected !!