Ambani_shiva pooja365

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢిల్లీ,ఫిబ్రవరి18,2023: ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ శనివారం మహాశివరాత్రి సందర్భంగా గుజరాత్‌లోని సోమనాథ్ మహాదేవ్ ఆలయాన్ని సందర్శించారు.

ఆయన తన కుమారుడు, రిలయన్స్ జియో చైర్మన్ ఆకాష్ అంబానీతో కలిసి ఆలయంలో స్వామివారికి పూజలు చేశారు. ఈసందర్భంగా సోమనాథ్ ఆలయ ట్రస్ట్‌కు అంబానీ రూ. 1.51 కోట్లు విరాళంగా అందించారు.

Ambani_shiva pooja365

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయానికివిచేసిన ముఖేష్ అంబానీ తోపాటు ఆయన కుమారుడు ఆకాష్ అంబానీలకు ఆలయ ట్రస్ట్ చైర్మన్ పి.కె. లాహిరి, కార్యదర్శి యోగేంద్రభాయ్ దేశాయ్ లు ఘనంగా స్వాగతం పలికారు.

ముఖేష్ అంబానీ, ఆకాష్ అంబానీ అభిషేకం చేసిన అనంతరం వారికి వేదాశీర్వచనమ్ ఇచ్చిన ఆలయ పూజారి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు.