365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆగస్టు 29,2024: ఫ్రీ క్లౌడ్ స్టోరేజీ: జియో కస్టమర్లకు 100GB ఉచిత క్లౌడ్ స్టోరేజీని అందించనున్నట్లు ముఖేష్‌ అంబానీ ప్రకటించారు. ఇది కస్టమర్లకు వారి డేటాను సురక్షితంగా భద్రపరచుకోవడానికి సహాయపడుతుంది.

హలో జియో సెటప్ బాక్స్: కొత్తగా OS టీవీతో “హలో జియో” పేరుతో సెటప్ బాక్స్ అందుబాటులోకి రానుంది. ఇది జియో ఫైబర్ వినియోగదారులకు మెరుగైన టీవీ వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది. ఏఐ బటన్‌తో జియో ఫైబర్ రిమోట్: జియో ఫైబర్ రిమోట్‌లో AI బటన్‌ను ప్రవేశపెట్టడంతో, వినియోగదారులు కొత్త ఫీచర్లను సులభంగా ఉపయోగించవచ్చు.

బోనస్ షేర్స్: రిలయన్స్‌ షేర్స్ ఉన్న వాటాదారులకు 1:1 పద్ధతిలో బోనస్ షేర్స్ ప్రకటించారు. ఇది షేర్ హోల్డర్లకు మంచి లాభం అందించనుంది.

కంపెనీలోకి వారసులు..

ముఖేష్‌ అంబానీ తన వారసులుగా ఈషా, ఆకాశ్‌, అనంత్‌ను ఎంపిక చేశారు. ఈషా రిటైల్, ఆకాశ్ జియో, అనంత్ న్యూ ఎనర్జీ బిజినెస్‌లను చూసే బాధ్యతలు తీసుకోనున్నారు. ముఖేష్‌ అంబానీ సంస్థ చైర్మన్‌గా మరో ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు.