365 తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, 17ఆగస్టు, 2021:సభ్య సమాజం సిగ్గు పడే రీతిలో మాట్లాడి బీసీల, మున్నూరు కాపుల మనోభావాలు దెబ్బ తీసేలా మాట్లాడిన ఎమ్మెల్యే మైనం పల్లి హనుమంత్ రావు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, బెషరుతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో
కాపు సంఘాల నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మున్నూరు కాపు తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ సర్దార్ పుటం పురుషోత్తమ రావు పటేల్, అపెక్స్ కౌన్సిల్ కన్వీనర్ సుంకరి బాలకిషన్ రావు పటేల్, అపెక్స్ కౌన్సిల్ సభ్యులు మీసాల చంద్రయ్య పటేల్, రాష్ట్ర నాయకులు మంగళారపు లక్ష్మణ్ పటేల్, ఎమ్. డి. ఎఫ్ అధ్యక్షులు ఎడ్ల రవి పటేల్, మున్నూరు కాపు యువత అధ్యక్షులు బండి సంజీవ్ పటేల్, సామల వేణు పటేల్, పర్వతం సతీష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.