365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, త్రివేండ్రం, అక్టోబర్ 15, 2024: 137 ఏళ్ల చరిత్ర కలిగిన ముథూట్ పప్పాచన్ గ్రూప్ (ముథూట్ బ్లూ) ఫ్లాగ్‌షిప్ కంపెనీ అయిన ముథూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్ (ఎంఎఫ్ఎల్) XVII విడత II సిరీస్‌లో సెక్యూర్డ్, రిడీమబుల్, నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లను (ఎన్‌సీడీలు) జారీ చేయనున్నట్లు ప్రకటించింది.
ఒక్కొక్క ఎన్‌సీడీ ముఖ విలువ రూ.1000 కాగా, మొత్తం రూ. 250 కోట్ల సమీకరణ లక్ష్యంగా పెట్టుకుంది, ఇది మొత్తం రూ. 2000 కోట్ల షెల్ఫ్ లిమిట్‌లో భాగంగా ఉంది.

XVII విడత II సిరీస్ ద్వారా మొదటగా రూ. 75 కోట్ల బేస్ ఇష్యూ పరిమాణంతో గ్రీన్ షూ ఆప్షన్ ద్వారా అదనంగా రూ. 175 కోట్లు సమీకరించేందుకు అవకాశం కల్పించింది, మొత్తం పరిమాణం రూ. 250 కోట్లకు చేరుకుంటుంది. ఈ ఇష్యూ అక్టోబర్ 11, 2024 నుండి ప్రారంభమై, అక్టోబర్ 24, 2024 న ముగియనుంది లేదా సంస్థ డైరెక్టర్ల బోర్డు, స్టాక్ అలోట్మెంట్ కమిటీ ముందస్తు ఆమోదం మేరకు ముందస్తుగా ముగించవచ్చు.
ఈ ఎన్‌సీడీలు 24, 36, 60, 72,92 నెలల కాలవ్యవధి ఆప్షన్లతో ఉంటాయి. నెలవారీ, వార్షిక లేదా సంచిత చెల్లింపుల ఎంపికలతో వినియోగదారులు సౌకర్యవంతంగా ఎంపిక చేసుకోవచ్చు. వివిధ ఇన్వెస్టర్ల కేటగిరీలకు ఎఫెక్టివ్ ఈల్డ్ (సంవత్సరానికి) 9.00% నుంచి 10.10% వరకు ఉంటుంది.
ఈ XVII విడత II సిరీస్‌లోని ఎన్‌సీడీలకు క్రిసిల్ AA-/స్టేబుల్ రేటింగ్ ఉంది. బీఎస్‌ఈ డెట్ మార్కెట్ సెగ్మెంట్‌లో లిస్ట్ చేయబడతాయి. ఈ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులు రుణాల కోసం,సంస్థ ప్రస్తుత రుణాల చెల్లింపుల కోసం ఉపయోగిస్తారు.

ముథూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్ సీఈవో షాజీ వర్గీస్ మాట్లాడుతూ, “మా ఇన్వెస్టర్లకు సురక్షితమైన పెట్టుబడి అవకాశాలను కల్పించేందుకు తదుపరి ఎన్‌సీడీ సిరీస్‌ను అందుబాటులోకి తెస్తున్నాం. ముథూట్ ఫిన్‌కార్ప్ 3,700 పైగా శాఖల ద్వారా లేదా ముథూట్ ఫిన్‌కార్ప్ వన్ యాప్ ద్వారా రూ. 5 లక్షల వరకు సులభంగా ఇన్వెస్ట్ చేయవచ్చు” అని తెలిపారు.