365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,త్రివేండ్రం,ఆగస్టు 29,2024: 137 సంవత్సరాల చరిత్ర గల ముథూట్ పప్పాచన్ గ్రూప్ (ముథూట్ బ్లూ) ఫ్లాగ్‌షిప్ కంపెనీ అయిన ముథూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్ (ఎంఎఫ్ఎల్ లేదా “కంపెనీ”) రూ. 350 కోట్ల వరకు నిధులను సమీకరించేందుకు ట్రాంచ్ I సిరీస్ కింద ఒక్కోటి రూ. 1,000 విలువ చేసే సెక్యూర్డ్, రిడీమబుల్, నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లను (“ఎన్‌సీడీలు”) చేయనున్నట్లు ప్రకటించింది.
ఇది రూ. 2,000 కోట్ల షెల్ఫ్ లిమిట్‌కి లోబడి ఉంటుంది. కంపెనీ నుంచి ఇది 17వ విడత ఇష్యూ. ట్రాంచ్ I ఇష్యూ పరిమాణం రూ. 250 కోట్ల గ్రీన్ షూ ఆప్షన్‌తో రూ. 100 కోట్లుగా (“బేస్ ఇష్యూ సైజ్”), మొత్తం మీద రూ. 350 కోట్లుగా (“ట్రాంచ్ I ఇష్యూ పరిమితి”) (“ట్రాంచ్ I ఇష్యూ”) ఉంటుంది. రూ. 1,000 ముఖ విలువ గల ట్రాంచ్ I ఇష్యూ 2024 ఆగస్టు 28న ప్రారంభమై, 2024 సెప్టంబర్ 10న ముగుస్తుంది.
కంపెనీ,బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లేదా స్టాక్ అలాట్‌మెంట్ కమిటీ ఆమోదానికి లోబడి,సవరించబడిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఇష్యూ అండ్ లిస్టింగ్ ఆఫ్ నాన్-కన్వర్టబుల్ సెక్యూరిటీస్) రెగ్యులేషన్స్, 2021 (సెబీ ఎన్‌సీఎస్ రెగ్యులేషన్స్)కి అనుగుణమైన సంబంధిత అనుమతులకు లోబడి ముందుగా కూడా ముగించవచ్చు.
ట్రాంచ్ I ఇష్యూ కింద ఆఫర్ చేస్తున్న ఎన్‌సీడీలకు 24,36,60,72,92 నెలల మెచ్యూరిటీ/కాలవ్యవధి ఆప్షన్లు ఉంటాయి. I, II, III, IV, V, VI, VII, VIII, IX, X, XI, XII,XIII ఆప్షన్లవ్యాప్తంగా నెలవారీ, వార్షిక, క్యుములేటివ్ పేమెంట్ ఆప్షన్లు ఉంటాయి. కస్టమర్లు తమకు అనువైనదాన్ని ఎంచుకోవచ్చు. అన్ని రకాల ఇన్వెస్టర్ల కేటగిరీల ఎన్‌సీడీహోల్డర్లకు ఎఫెక్టివ్ ఈల్డ్ (వార్షికంగా) 9.38% నుంచి 10.10% వరకు ఉంటుంది.
ఎన్‌సీడీ ట్రాంచ్ I కింద జారీ చేసే ఎన్‌సీడీలకు క్రిసిల్ రేటింగ్స్ లిమిటెడ్ సంస్థ నుంచి క్రిసిల్ AA-/స్టేబుల్ (స్టేబుల్ అవుట్‌లుక్‌తో క్రిసిల్ డబుల్ A మైనస్ రేటింగ్‌గా వ్యవహరించబడుతుంది) రేటింగ్ ఉంది. వీటిని బీఎస్ఈలోని డెట్ మార్కెట్ సెగ్మెంట్‌లో లిస్ట్ చేసే ప్రతిపాదన ఉంది.
తదుపరి రుణాలు ఇచ్చేందుకు, ఫైనాన్సింగ్ కోసం, కంపెనీ ప్రస్తుతం తీసుకున్న రుణాల అసలు, వడ్డీ రీపేమెంట్/ప్రీపేమెంట్ కోసం,సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం ట్రాంచ్ I ఇష్యూ కింద సమీకరించే నిధులు వినియోగించుకోబడతాయి.
“ఇన్వెస్టర్ల కోసం ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, కాలవ్యవధులు, సరళతరమైన వడ్డీ చెల్లింపు ఆప్షన్లతో కొత్త సిరీస్ ఎన్‌సీడీలను జారీ చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం.
ఇన్వెస్టర్లు దేశవ్యాప్తంగా ఉన్న 3,700 పైచిలుకు ముథూట్ ఫిన్‌కార్ప్ శాఖల ద్వారా లేదా తమ ఇంటి దగ్గర్నుంచే సౌకర్యవంతంగా మా ముథూట్ ఫిన్‌కార్ప్ వన్ మొబైల్ యాప్ ద్వారా (రూ. 5 లక్షల వరకు) ఇన్వెస్ట్ చేయొచ్చు” అని ముథూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్ సీఈవో షాజీ వర్గీస్ తెలిపారు.