365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,త్రివేండ్రం, ఏప్రిల్ 18, 2024 :137 ఏళ్ల ముత్తూట్ పప్పాచన్ గ్రూప్ (ముత్తూట్ బ్లూ) ఫ్లాగ్షిప్ కంపెనీ అయిన ముత్తూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్ (MFL లేదా “కంపెనీ”) తమ XVI ట్రాంచ్ IV సిరీస్ సెక్యూర్డు , రీడీమబుల్, నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లను (“NCDs”) మొత్తం రూ. 1100 కోట్ల షెల్ఫ్ పరిమితిలో రూ. 360 కోట్లను సమీకరించడం లక్ష్యంగా ప్రకటించింది.
ట్రాంచ్ IV ఇష్యూ మొత్తం రూ. 100 కోట్లు, కాగా గ్రీన్ షూ ఎంపిక రూ. 260 కోట్లతో కలిపి మొత్తం రూ. 360 కోట్లు (“ట్రాంచ్ IV ఇష్యూ”). రూ. 1000 ముఖ విలువ కలిగిన ట్రాంచ్ IV ఇష్యూ 10 ఏప్రిల్ 2024 నుంచి ఏప్రిల్ 25, 2024 వరకు పబ్లిక్ కోసం తెరవనుంది.
డైరెక్టర్ల బోర్డు లేదా కంపెనీ సక్రమంగా ఏర్పాటు చేసిన కమిటీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (నాన్-కన్వర్టబుల్ సెక్యూరిటీల ఇష్యూ ,లిస్టింగ్) రెగ్యులేషన్స్, 2021 రెగ్యులేషన్ 33A ప్రకారం సంబంధిత ఆమోదాలకు లోబడి ముందుగానే దీనిని మూసివేసే అవకాశం కూడా ఉంటుంది.
ట్రాంచ్ IV ఇష్యూ కింద ఉన్న NCDలు 26 నెలలు, 38 నెలలు, 60 నెలలు, 72 నెలలు, 94 నెలల మెచ్యూరిటీ/కాల పరిమితి ఎంపికలతో వివిధ పథకాలలో నెలవారీ, వార్షిక, సంచిత చెల్లింపు ఎంపికలతో అందించనున్నాయి – I, II, III, IV , V, VI, VII, VIII, IX, X, XI, XII, XIII నుంచి వినియోగదారులు సౌకర్యవంతంగా ఎంచుకోవచ్చు.
అన్ని కేటగిరీల ఇన్వెస్టర్లలోని ఎన్సిడి హోల్డర్లకు ప్రభావవంతమైన రాబడి (సంవత్సరానికి) 8.90 శాతం నుంచి 10 శాతం వరకు ఉంటుంది. ట్రాంచ్ IV క్రింద జారీ చేసిన సురక్షిత NCDలు క్రిసిల్ ద్వారా AA-/ స్టేబుల్ గా రేట్ చేశాయి. BSE డెట్ మార్కెట్ విభాగంలో జాబితా చేయాలని ప్రతిపాదించింది.
ఈ నిధులు తదుపరి రుణాలు, ఫైనాన్సింగ్, మా కంపెనీ ప్రస్తుత రుణాల ,వడ్డీని తిరిగి చెల్లించడం/ముందస్తు చెల్లింపు ,సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఉపయోగించనున్నాయి.
“మునుపటి సిరీస్ సానుకూల స్పందనను పొందింది. ఈ ఇష్యూ కు కూడా అదే విధమైన స్పందన ఉంటుందని ఆశిస్తున్నాము. కస్టమర్లు ఈ ట్రాంచ్లోని 13 విభిన్న అవకాశాల నుంచి ఎంచుకోవచ్చు. MFL 3600+ శాఖల ద్వారా లేదా మా మొబైల్ యాప్ ముత్తూట్ ఫిన్ కార్ప్ వన్ (రూ. 5 లక్షల వరకు) ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు.
క్రిసిల్ ద్వారా AA-/ స్టేబుల్ రేటింగ్‌తో పాటు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు,బహుళ కాల పరిమితి అవకాశాలతో మా పెట్టుబడిదారులకు వారి పెట్టుబడి పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపరచడానికి తగిన మార్గాన్ని అందించడంపై దృష్టి సారించాము, ”అని ముత్తూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్ సీఈఓ షాజీ వర్గీస్ అన్నారు.
Also read : Muthoot FinCorp Limited announces XVI Tranche IV series of NCDs, aims to raise Rs.360 crore
ఇది కూడా చదవండి: 40 లక్షల ట్రాక్టర్ల అమ్మకాల మైలురాయిని అధిగమించిన మహీంద్రా ట్రాక్టర్స్
Also read : Mahindra Tractors crosses Milestone by Selling 40 Lakh Tractor Units
Also read : Airtel Payments Bank Launches Interoperable Eco-friendly NCMC Enabled Debit and Pre-paid Cards
Also read : MG Motor India joins forces with Epsilon Group to enhance EV Ecosystem in India
Also read : PBPartners unveils its future-ready vision at annual flagshipbusiness meet, Shapath 3.0
Also read : NPCI Bharat BillPay Partners with SBI to Introduce NCMC Recharge as a New Biller Category.
ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో ఓటర్ల జాబితా నుంచి 5,41,201 మంది తొలగింపు..