365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఫిబ్రవరి 22, 2023 : భారతీయ ఆర్థికాభివృద్ధి లక్షలాది మంది రిటైలర్లు, ట్రేడర్లు, స్వయం ఉపాధి పొందుతున్నవారి వ్యాపారాభివృద్ది కోసం ఋణాలను అందించేందుకు ముందుకువచ్చింది. అందులో భాగంగా ముత్తూట్ ఫిన్‌కార్ప్ ఇప్పుడు విప్లవాత్మకమైన ప్రొడక్ట్ “వ్యాపార్ మిత్ర”ను తీసుకువచ్చింది.
ఈ వ్యాపార్ మిత్ర ద్వారా వాణిజ్యవేత్తలు, వ్యాపార యజమానులు, స్వయంగా ఉపాధి పొందుతున్న వ్యక్తులు తమ రోజువారీ నగదు ఆధారంగా ఎలాంటి అదనపు హామీ ఇవ్వాల్సిన అవసరం లేకుండా రుణాలు పొందవచ్చు.
మార్కెట్‌లో వ్యాపార మిత్రను వినూత్నంగా నిలిపే అంశం ఏమిటంటే, ఆదాయ పన్ను రిటర్న్‌పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేకుండానే, సిబిల్ స్కోర్ రికార్డ్స్ లేకుండానే వ్యాపార ఋణాలను పొందవచ్చు.
రోజువారీ చెల్లింపు అవకాశంతో రోజువారీ ఆదాయ ప్రయోజనాలను సైతం షాప్ యజమానులు పొందవచ్చు, అలాగే వడ్డీ కూడా తగ్గించుకునే సదుపాయం ఉండటం వల్ల బ్యాంకు ఋణాలతో పోలిస్తే మరింత ఆకర్షణీయంగా “వ్యాపార్‌మిత్ర” ఋణాలను పొందవచ్చు.
అంతేకాదు ఋణం పొందే తప్పుడు ముందస్తు చెల్లింపు చార్జీలు లేవు. అలాగే సంవత్సరానికి మూడుసార్లు ఋణాలను రెన్యువల్ చేసుకోవచ్చు. అతి సరళమైన, వేగవంతమైన డాక్యుమెంటేషన్‌తో పాటు ఋణాలను స్పీడ్ గా పొందవచ్చు.
“వ్యాపార్ మిత్ర”ను ఫిబ్రవరి15వతేదీన విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 3600కు పైగా ముత్తూట్ ఫిన్‌కార్ప్ శాఖలలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.
‘‘దేశంలోని సామాన్యుల జీవితాలను సమూలంగా మార్చడానికి ముత్తూట్ ఫిన్‌కార్ప్ ప్రయత్నిస్తుంటుంది. బ్యాంకు సేవలు అందుబాటులో లేని వారికి ఎంఎఫ్‌ఎల్ ద్వారా బ్యాంకింగ్ రంగంలో లాంఛనంగా ప్రవేశించేందుకు సైతం తోడ్పడుతుంది.
వినియోగదారుల అవసరాలను తీర్చడానికి ఈ ప్రొడక్ట్‌ను తీర్చిదిద్దారు. మరీ ముఖ్యంగా రోజువారీ ఆదాయ పొందుతున్న వ్యాపారులకు సూక్ష్మ, చిరు వ్యాపార సంస్థల యజమానుల కోసం ఈ అవకాశాలను తీసుకురావాలనుకున్నామని,
రిటైల్ ట్రేడర్లు, షాప్ కీపర్లకు సాధికారితనందిస్తూ ఆర్ధిక వ్యవస్ధ పురోభివృద్ధిలో వ్యాపార్ మిత్ర అత్యంత కీలకమైన పాత్ర పోషించగలదని ఆశిస్తున్నాము’’ అని ముత్తూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షాజీవర్గీస్ తెలిపారు.
ప్రజల జీవితాలను సమూలంగా మార్చడంలో తమ 136 సంవత్సరాల అనుభవానికి మరో కీర్తికిరీటం తొడుగుతూ, ముత్తూట్ ఫిన్‌కార్ప్ అభివృద్ధి చేసిన మరో వినియోగదారుల లక్ష్యిత ఉత్పత్తి వ్యాపార్ మిత్ర. ప్రతి వ్యాపార విభాగం ప్రత్యేక అవసరాలు దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా దీనిని తీర్చిదిద్దామని షాజీ వర్గీస్ చెప్పారు.
ప్రతి రోజూ 1,25,000 మంది వినియోగదారులకు సేవలనందిస్తున్న ముత్తూట్ పప్పా చాన్ గ్రూప్ పలు రంగాల్లో తమ దైన గుర్తింపు తెచుకుంది. ముఖ్యంగా ఆర్థిక సేవలు, పర్యాటకం, రవాణా, రియల్ ఎస్టేట్, ఐటీ సేవలు, ఆరోగ్య సంరక్షణ, అరుదైన లోహాలు , అంతర్జాతీయ సేవలు ,ప్రత్యామ్నాయ ఇంధన రంగాలలో తమ సేవలను అందిస్తుంది ఈ సంస్థ.