Sun. Dec 1st, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 24,2024: “మేము నివాసం వుంటున్న ఇల్లు బఫర్ జోన్లో ఉంది” అంటూ కొన్ని సామాజిక మాధ్యమాల్లో, పత్రికల్లో వస్తున్న వార్తలపై హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్పష్టతనిచ్చారు.

వాస్తవాలు ఇలా ఉన్నాయి..

  • మధురా నగర్లో మేము నివసిస్తున్న ఇల్లు 1980లో నా తండ్రి ఏపీవి సుబ్బయ్య గారు నిర్మించారు.
  • 44 ఏళ్లుగా అదే ఇంట్లో నివసిస్తున్నాము.
  • ప్రస్తుతం కృష్ణకాంత్ పార్క్‌గా ఉన్న ప్రదేశం 25 ఏళ్ల క్రితం పెద్ద చెరువు ఉండేది.
  • చెరువు ఉన్నప్పటి నిబంధనల ప్రకారం కూడా మా ఇల్లు చెరువు కట్టకు 1 కిలోమీటర్ దూరంలో ఉంది.
  • చెరువు కట్ట దిగువ భాగంలో 5-10 మీటర్ల వరకు మాత్రమే ఇరిగేషన్ శాఖ బఫర్ జోన్‌గా పరిగణిస్తుంది.

అయితే…

  • మా ఇల్లు చెరువు కట్టకు 1 కిలోమీటర్ దూరంలో ఉండటంతో, ఇది బఫర్ జోన్ పరిధిలోకి రాదని స్పష్టం చేశారు.
  • ఇంకా, మా నివాసానికి సమీపంలో ఉన్న కట్ట మైసమ్మ గుడి కూడా కట్టకు 1 కిలోమీటర్ దూరంలో ఉంది.
  • “కట్ట మైసమ్మ ఆలయాలు చెరువు కట్టల సమీపంలో ఉండటం సంప్రదాయం” అని పేర్కొన్నారు.

తప్పుడు ప్రచారం ఖండన

“వాస్తవాలు తెలుసుకోకుండా మా నివాసం గురించి తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను ఖండిస్తున్నాను. మా ఇల్లు బఫర్ జోన్లో లేదని, అందుకు సంబంధించిన ఫోటోలను పరిశీలించాలని కోరుతున్నాను,” అని ఏవి రంగనాథ్ వెల్లడించారు. మేము నివసిస్తున్న ఇంటికి సంబంధించి తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని కోరారు.

error: Content is protected !!