365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, సెప్టెంబర్ 25, 2020: కిమ్స్ ఆసుపత్రిలోని అత్యవసర విభాగానికి (ఎమర్జెన్సీ డిపార్టుమెంట్) ప్రతిష్ఠాత్మకమైన సర్టిఫికెట్ వచ్చింది. నేషనల్ ఎక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ (ఎన్ఏబీహెచ్) అనే సంస్థ భారతదేశంలో ఆసుపత్రుల నాణ్యత నిర్ధారణ బోర్డు. దాని ప్రమాణాలకు కిమ్స్ ఆసుపత్రిలోని అత్యవసర విభాగం తగినట్లుగా ఉందని ఎన్ఏబీహెచ్ సర్టిఫికెట్ ఇచ్చింది. తెలంగాణలో అత్యవసర వైద్యసేవల విభాగానికి ఎన్ఏబీహెచ్ గుర్తింపు సర్టిఫికెట్ పొందిన తొలి ఆసుపత్రి కిమ్స్ కావడం గమనార్హం. 27 పడకలు, 40 మంది వైద్యులు, ఇతర సిబ్బంది ఉన్న కిమ్స్ అత్యవసర విభాగం హైదరాబాద్ నగరంలోని ఆసుపత్రుల్లో ఉన్న అతిపెద్ద ఎమర్జెన్సీ డిపార్టుమెంట్లలో ఒకటి. ఇన్ఫెక్షన్ నియంత్రణకు అత్యుత్తమ విధానాలు పాటించడంతో పాటు రోగులు, వారి సంరక్షకులు, రోజువారీగా వారికి చికిత్సలు అందించే సిబ్బంది ఎవరికీ ఇన్ఫెక్షన్లు సోకకుండా ఆసుపత్రిలో పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకుంటారు.ఎన్ఏబీహెచ్ ప్రమాణాలు పాటించడం వల్ల నాణ్యతతో కూడిన సంరక్షణ, అత్యవసర విభాగానికి వచ్చే రోగులకు తగినంత భద్రత ఉంటాయి. దాంతోపాటు నిరంతరం ఇక్కడి నాణ్యతను మెరుగుపరిచే ప్రయత్నాలు జరుగుతుంటాయి.
అత్యవసర విభాగానికి వచ్చే రోగులకు వారి అవసరాన్ని బట్టి అత్యవసర వైద్యం అందిస్తారు. కార్డియో పల్మనరీ రీససికేషన్ (పీసీఆర్), అంబులెన్సు సేవలు, నర్సింగ్ సేవల విషయంలో ప్రామాణిక ప్రోటోకాల్స్ పాటిస్తారు. మత్తు ఇవ్వడం, నిగ్రహం, చివరి నిమిషాల్లో తీసుకునే సంరక్షణ, నొప్పి నివారణ తదితర అంశాల్లో రోగుల హక్కులు, బాధ్యతలకూ ప్రాధాన్యం ఇస్తారు.