365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్ ,జనవరి 25,2023: బాలికల విద్యే ప్రగతికి మెట్లు అని డా.హిప్నో పద్మా కమలాకర్ అన్నారు. ఆమె మంగళవారం జాతీయ బాలికా దినోత్సవం, అంతర్జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా బాలికలు ఆరోగ్యంగా ఉండటం కోసం డా.హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్, నవభారత్, ప్రకృతి లైన్స్ క్లబ్ ల సంయుక్తాధ్వర్యంలో బాలికలకు ముషిరాబాద్ రైయిన్ బో హోమ్ లో విటమిన్ టాబ్లెట్లు, పోషకాహారం, పుస్తకాలు అందించారు. ఈ కార్యక్రమంలో లయన్ కృష్ణ వేణి, లయన్ పి.స్వరూపా రాణిలు పాల్గొన్నారు.
బాలికలు చదువుకుంటే సమాజం మరింత అభివృద్ధి సాధిస్తుందని, బాలికల హక్కుల గురించి అవగాహన కల్పించడానికి, వారి జీవితాల్లో వారు ఎదుర్కొంటున్న అసమానతలను ఎత్తిచూపడానికి భారతదేశంలో ప్రతిఏటా జనవరి 24న బాలికా దినోత్సవం జరుపు కుంటున్నామని డా.హిప్నో పద్మా కమలాకర్ తెలిపారు.
భారతీయ సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న అసమానతల గురించి అవగాహన కల్పించడానికి, ఆడపిల్లల హక్కులు విద్య, ఆరోగ్యం, పోషకాహారం ప్రాముఖ్యత గురించి తెలుసు కోవాలని ఆమె పేర్కొన్నారు.
ఆడపిల్లను రక్షించు కోవాలని, భారతదేశంలోని బాలికలకు మద్దతు ఇవ్వడం, చదివించడం, ఉపాధిఅవకాశాలను అందించాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో నవభారత లయన్స్ క్లబ్ మాజి అధ్యక్షులు జే.టి.విద్యా సాగర్, అధ్యక్షులు గోపాల కృష్ణ,రమణమ్మ సదాలక్ష్మీ, వరలక్ష్మి బాల బాలికలు పాల్గొన్నారు.
డా.హిప్నో పద్మా కమలాకర్
కౌన్సెలింగ్ సైకో థెరపిస్ట్, హిప్నో థెరపీస్ట్
@9390044031