Thu. Nov 21st, 2024
padmakamalakar

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,నవంబర్ 30,2022: సైకాలజిస్టుల వృత్తి నైపుణ్యాలు పెంపొందించేందుకు డిసెంబర్10న ప్రముఖ సెక్సాలజిస్టు డా.జి.సమరంతో దాంపత్య వికాసంపై నేషనల్ లెవల్ ట్రైనింగ్ క్యాంప్ జరగనుంది.

ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఇండియా ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి ఆ సంస్థ అధ్యక్షురాలు డా హిప్నో పద్మా కమలాకర్, డా.క్యార్లిన్ లతో పాటు ముఖ్య అతిథులుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ, డా.జి.సమరంలు హాజరుకానున్నారు.

padmakamalakar

డిసెంబర్10న విజయవాడలో జరిగే జాతీయ స్థాయి శిక్షణా శిబిరం గురించిన విశేషాలను ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఇండియా, అధ్యక్షురాలు డా హిప్నో పద్మా కమలాకర్, డా. క్యార్లిన్ ఋధవారం డా హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ లో మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ, డా.జి.సమరం హాజరు కానున్నట్లు ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఇండియా, అధ్యక్షురాలు డా హిప్నో పద్మా కమలాకర్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇటీవల గ్యాంగ్ రేప్ లు, రేప్ లు, లైంగిక వేధింపులు విపరీతంగా పెరిగి పోయాయన్నారు. కరోనా సమయంలో, ఆ తరువాత దంపతుల మధ్య లైంగిక విజ్ఞానంపై సరైన అవగాహన లేకపోవడంతో విడాకులుతీసుకునేవారి సంఖ్య పెరిగిందని హిప్నో పద్మా కమలాకర్ తెలిపారు.

padmakamalakar

అందుకోసమే దాంపత్య వికాసంపై డిసెంబర్ 10న విజయవాడ ఐకాన్ పబ్లిక్ స్కూల్ లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పూర్వ జాతీయ అధ్యక్షులు డా. జి‌. సమరంగారితో లైంగిక విజ్ఞానంపై అవగాహన కార్యక్రమం ఉంటుందని ఆమె వెల్లడించారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డా.జి.వీరభద్రం, డా.వి.జనార్థనం, పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుందని హిప్నో పద్మా కమలాకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సైకాలజిస్టులు, సైకాలజీ విద్యార్థులతోపాటు ప్రభుత్వ టీచర్లు, లెక్చరర్లు, లాయర్లు, సామాజిక సేవా కార్యకర్తలు పాల్గొనవచ్చని ఆమె తెలిపారు. మరిన్ని వివరాలకు 9390044031/9390044034 నెంబర్లలో సంప్రదించాలని పద్మాకమలాకర్ వెల్లడించారు.

padmakamalakar

ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ -ఇండియా, డా హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్,అశోక్ నగర్ క్రాస్ రోడ్స్, హైదరాబాద్.సెల్ @9390044031 & 9399944034.

ఇవి కూడా చదవండి..
డిసెంబర్10న డా.జి.సమరంతో దాంపత్య వికాసంపై నేషనల్ లెవల్ ట్రైనింగ్ క్యాంప్
ఇండియాలో మొట్టమొదటి అంతర్జాతీయ బౌద్ధ విశ్వవిద్యాలయం.. ఎక్కడంటే..?
ఫ్రీగా హిందూ పురాణాలకు సంబంధించిన పీడీఎఫ్ బుక్స్..

సమీర్ శర్మ కు సీఎం జగన్ కీలక బాధ్యతలు

వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం..విచారణ తెలంగాణకు బదిలీ
పిల్లల్లో మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..?
అమ్మకానికి మినరల్ వాటర్ కంపెనీ బిస్లరీ..కారణం ఇదే..
ఏపీ లోని రైతులందరికి గుడ్ న్యూస్

పాట్నాలో ఎయిర్ టెల్ 5G ప్లస్ సేవలు ప్రారంభం

త్వరలో మార్కెట్ లోకి రానున్న వన్ ప్లస్ 11
నాసల్ కోవిడ్ వ్యాక్సిన్‌ కు ఆమోదం..

ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

చిన్నారుల్లో ఊబకాయానికి ప్రధాన కారణాలు.. ?
శరీరంలో అత్యంత బరువైన అవయవం ఏది..?

CM Jagan entrusted key responsibilities to CS Sameer Sharma

error: Content is protected !!