365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,పుణె, జూలై 16 (2025): జూలై నెల రెండవ ఆదివారం దేశవ్యాప్తంగా జావా-యెజ్డీ రైడర్ల ఉత్సాహంతో దద్దరిల్లింది. ప్రతి ఏటా జరుపుకునే అంతర్జాతీయ జావా-యెజ్డీ దినోత్సవం ఈసారి మరింత వైభవంగా జరిగింది. దేశ నలుమూలల నుంచి 6,000 మందికిపైగా రైడర్లు పాల్గొని తమ క్లాసిక్ మోటార్ సైక్ల్స్‌పై ప్రేమను ఘనంగా చాటారు.
12 రాష్ట్రాలు – 20 నగరాలు – 18 రైడింగ్ సమూహాలు – 120 డీలర్ షిప్స్
ఈ వేడుకల్లో మణిపూర్ పర్వతాల నుంచి కేరళ బీచ్‌ల వరకూ, ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు రైడర్లు పాల్గొన్నారు. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, బెంగళూరు, చెన్నై, త్రివేండ్రం, మణిపూర్, మహారాష్ట్ర, మంగళూరు, నాగర్ కోయిల్, పాలక్కడ్, ఛండీగఢ్, ఛత్తీస్‌గఢ్ వంటి ప్రాంతాల క్లబ్‌లు తమ ఉత్సాహాన్ని జోడించాయి.
ఇది కూడా చదవండి…భారతీయ స్క్రీన్ రచయితలకు జీ సంస్థ బంపర్ ఆఫర్..
ఇది కూడా చదవండి…విశాఖలో జియో విశిష్టత మరోసారి రుజువు – ట్రాయ్ డ్రైవ్ టెస్ట్‌లో అగ్రస్థానం
పాతతరం, కొత్తతరం కలయిక
ఈ కార్యక్రమంలో వృద్ధుల నుంచి జెన్‌జెడ్ వరకు రైడింగ్ పట్ల తమకున్న ప్రేమను చాటుకున్నారు. ఓ వైపు క్లాసిక్ క్రూయిజర్లపై మైలుల కొద్దీ రైడ్ చేసిన అనుభవజ్ఞులు, మరోవైపు తమ GoPro కెమెరాలు, మ్యూజిక్ ప్లేలిస్టులతో కొత్త తరం యువరైడర్లు – అందరూ ఒకే జావా యెజ్డీ కుటుంబంగా అనిపించుకున్నారు.

జ్ఞాపకాలే కాదు, శైలీ కూడా
క్లాసిక్ లెజండ్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ శరద్ అగర్వాల్ మాట్లాడుతూ, “జావా-యెజ్డీలు వయస్సుకు అతీతంగా, ఒక భావానికి ప్రతీకగా మారాయి. ఇవి మేము నడిపే బైక్స్ కాదు – మన అనుభవాలను చెప్పే కళాఖండాలు,” అని చెప్పారు.
Read This also…Jio Tops TRAI Drive Test in Vizag, Strengthens Network Leadership in Andhra Pradesh
ప్రతి హెల్మెట్ వెనక ఒక గౌరవం
ఈరోజు ప్రతి రైడర్ తన బైక్‌ను గర్వంగా నడిపాడు. ఎందుకంటే ఇది కేవలం రైడింగ్ కాదని, ఒక ప్యాషన్, ఒక వారసత్వాన్ని కొనసాగించడం అనే భావనతో ఈ వేడుకకు హాజరయ్యారు. ప్రతి ఏడాది ఈ ఉత్సవం మరింతగా విస్తరిస్తోంది. ఇది తేటతెల్లంగా చెబుతోంది: క్లాసిక్ అనేది ఒక్క ఒల్డ్ మోడల్ కాదు… అది జీవించి ఉంటుంది, గర్జిస్తూ ముందుకు సాగుతూనే ఉంటుంది!