365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, దంతెవాడ, ఏప్రిల్ 26, 2023: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో నక్సల్స్ దాడి చేశారు. అరన్‌పూర్‌లో నక్సలైట్లు ఐఈడీని పేల్చారు. ఈ పేలుడులో 10 మంది డిఆర్‌జి (డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్) సైనికులు వీరమరణం పొందారు.
ఈ దాడిలో ఓ డ్రైవర్ కూడా మృతి చెందాడు. పేలుడు తర్వాత ఆ ప్రాంతాన్ని సీల్ చేశారు. సైనికుల కారును నక్సలైట్లు పేల్చివేశారు. దాడి అనంతరం సైనికులు, నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. దంతేవాడలోని అరన్‌పూర్‌లోని పల్నార్ మార్గ్‌లో నక్సలైట్లు ఈ పేలుడుకు పాల్పడ్డారు. దంతేవాడలోని అరన్‌పూర్ ప్రాంతంలో నక్సలైట్లు దాక్కున్నారనే వార్త నిన్ననే అందింది.
ఈ సమాచారం మేరకు దంతెవాడ నుంచి డీఆర్‌జీ బలగాలు నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ల కోసం అరన్‌పూర్‌కు వెళ్లాయి. సెర్చ్ ఆపరేషన్ తర్వాత జవాన్లందరూ తిరిగి వస్తుండగా, నక్సలైట్లు ఐడీని పేల్చారు.
నక్సలైట్ల దాడిపై ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేంద్ర బఘేల్ విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి నక్సలిజాన్ని అంత మొందించేందుకు తాను సిద్ధమని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో నక్సలైట్లపై పోరు చివరి దశలో ఉందని, త్వరలోనే ముగుస్తుందని చెప్పారు.
ఈ దాడికి సంబంధించి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ తో దేశ హోంమంత్రి అమిత్ షా ఫోన్‌లో మాట్లాడారు. సీఎం బఘెల్‌కు అన్ని విధాలా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఏది కోరితే అది ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన హామీ ఇచ్చారు.
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ మాట్లాడుతూ ఇది చాలా బాధాకరం.. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి అని అన్నారు. ఏ నక్సలైట్‌ను వదిలిపెట్టము అని, ఈ దాడి తరువాత, పరిసర ప్రాంతంలో భద్రతను పెంచామని చెప్పారు. ఈ దాడిపై ఐజీపీ సుందర్‌రాజ్ ప్రకటన తెరపైకి వచ్చింది. దాడిని ధృవీకరిస్తూ, దంతెవాడలో నక్సలైట్లు దాడి చేశారని చెప్పారు.