365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జనవరి 30 హైదరాబాద్ : ఈరోజు నుంచి రెండురోజుల పాటు నగరంలో “ఎన్‌సీసీ కప్ హార్స్ షో “జరగనున్నది. రాజేంద్ర నగర్ ఎన్‌సిసి గ్రౌండ్ లో “ఎన్‌సీసీ కప్ హార్స్ షో ” పేరుతో ఈరోజు, రేపు నిర్వహించనున్నారు. ఈ షో లో మూడు కేటగిరీల్లో 12-15 , 16-18, 18-21 ఏండ్ల వయసున్నవారు పాల్గొననున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారుల కోసం బెలూన్ అండ్ బకెట్, స్టిక్ అండ్ బాల్ ఈవెంట్స్ జరుగుతాయి. ఈ షోను ఎన్సీసీ డిప్యూటీ డీజీ ప్రవీణ్ గౌర్ ప్రారంభించనున్నారు. రేపు జరిగే బహుమతి పంపిణీ కార్యక్రమానికి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ బీపీ దూబే కోరారు.