Sun. Sep 15th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నేషనల్,ఆగస్టు 6,2024: విదేశాల్లో విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు భారతదేశపు దిగ్గజ ట్రావెల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫాం నియో బాసటగా నిలుస్తోంది. తాజాగా అమెరికాలోని మసాచుసెట్స్‌లో పేరొందిన వర్సిటీలో విద్యను అభ్యసించేందుకు హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌కు చెందిన 21 ఏళ్ల భాను ప్రకాశ్‌కు 2,000 డాలర్ల స్కాలర్‌షిప్ అందించింది.

బిజినెస్ అనలిటిక్స్‌లో మాస్టర్స్ చేశాక, స్వదేశం తిరిగి వచ్చి స్టార్టప్ ప్రారంభించాలని, దేశ పురోగతిలో పాలుపంచుకోవాలని ప్రకాశ్ ఆకాంక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కొయ్యలగూడెం అనే చిన్న ఊరు అతని స్వగ్రామం. తండ్రి సంపాదనే కుటుంబానికి ఆధారం.

ప్రకాశ్ తొమ్మిది యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకోగా చాలా మటుకు వర్సిటీల్లో అడ్మిషన్ లభించింది. బ్రాండిస్ వర్సిటీ 40 శాతం స్కాలర్‌షిప్ కూడా ఆఫర్ చేయడంతో అక్కడ మాస్టర్స్ చేయాలని నిర్ణయించుకున్నారు.

అమెరికాకు వెళ్లే క్రమంలో ప్రకాశ్‌కి తొలినాళ్లలో ఎదురయ్యే చాలా మటుకు ఖర్చులకు నియో స్కాలర్‌షిప్ సరిపోతుంది.

ఈ ఫాల్ సీజన్‌లో విదేశీ విద్య కోసం వెళ్లే విద్యార్థులకు ఆర్థిక భారాన్ని కొంత తగ్గించే ఉద్దేశంతో నియో తమ స్కాలర్‌షిప్ ప్రోగ్రాంను తలపెట్టింది. ఇందుకోసం 20,000 డాలర్లతో నిధి ఏర్పాటు చేసింది. పది మంది విద్యార్థులకు తలో 2,000 డాలర్లు ఉపకారవేతనం అందిస్తోంది.

ఈ ప్రోగ్రాంలో హైదరాబాద్ నుంచి అత్యధిక సంఖ్యలో (25 శాతం) మంది పాల్గొన్నారు. తర్వాత స్థానాల్లో అహ్మదాబాద్ (22 శాతం), భువనేశ్వర్ (18 శాతం), పుణె, కొచ్చి, ముంబై, ఢిల్లీ ఉన్నాయి.

ఇంటర్నేషనల్ ట్రావెల్‌కి సంబంధించి జీరో మార్కప్ డెబిట్, క్రెడిట్ కార్డులను నియో అందిస్తోంది. సంస్థకు 15 లక్షల మంది పైచిలుకు కస్టమర్లు ఉన్నారు. విదేశాల్లో చదివే విద్యార్థులు కాలేజీ ఫీజులు, రోజువారీ ఖర్చులు మొదలైన వాటిపై సగటున రూ. 40 లక్షలు వార్షికంగా ఖర్చు చేస్తారని అంచనా. నియో జీరో-ఫారెక్స్ మార్కప్ కార్డులతో విదేశీ కరెన్సీ మార్కప్‌లకు సంబంధించి రూ. 2 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు.

“విదేశీ విద్య అభిలషించే భాను ప్రకాష్ వంటి విద్యార్థులకు నియో స్కాలర్‌షిప్ ప్రోగ్రాం ద్వారా తోడ్పాటు అందించడం మాకు సంతోషకరమైన విషంయం. విదేశీ విద్యను దేశవ్యాప్తంగా విద్యార్థులకు మరింత అందుబాటులోకి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో మా జీరో-ఫారెక్స్ మార్కప్ కార్డు కూడా ఒకటి” అని నియో సహ-వ్యవస్థాపకుడు, సీఈవో వినయ్ బాగ్రి (Vinay Bagri) తెలిపారు.

నియో స్కాలర్‌షిప్‌ల గురించి మరింతగా తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి- https://goniyo.com/blog/niyo-scholarship/

Also read: Hyderabad’s Bhanu Prakash Receives Niyo Scholarship worth $2000 for Overseas Education

ఇదికూడా చదవండి:ఆగస్టులో అన్నిటిపై ఆఫర్లే ఆఫర్లు..

ఇదికూడా చదవండి:ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ ఫీజు తప్పనిసరి

error: Content is protected !!