
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఆగస్టు 23,2021: జల్దీ ఆవో, లవాకరా యే, వెకమకవా, వెన్ రాపిడో….భాష ఏదైనా సరే…భావం మాత్రం ఒక్కటే. ఇప్పటికే ఏడాది గడిచింది. ఇక్కడ ఇప్పుడు మనం మన ప్రొఫెసర్ మేధస్సును చూడాల్సిందే.
ఇక మనం ఎంత మాత్రం వేచిఉండలేం. ఢి- డే కు సమీపించాం. ఇక ఇప్పుడు మనం పాడుదాం బెల్లా సియో….జల్దీ ఆవో. న్యూక్లెయా కంపోజ్ చేసిన ఈ పాటలో సెలెబ్రిటీ అభిమానులు అనిల్ కపూర్, రానా దగ్గుపాటి, రాధి కా ఆప్టే, హార్థిక్ పాండే, విక్రాంత్ మాసె, శృతి హాసన్ లాంటి వారంతా ఇందులో కనిపిస్తారు. బెల్లా సియోకు ఒక సృజనాత్మక రూపకల్పన జల్దీ ఆవో. ఇది ఈ షో అభిమానులకు అంకితం. ఇది మన భావోద్వేగాలకు సరిగ్గా అద్దం పడుతుంది. ఆయా పాత్రల పట్ల మన ప్రేమాభిమానాలను చాటి చెబుతుంది. మీ అభిమాన తారలను చూసేందుకు సిద్ధం కండి.

ఈ పాట కంపోజర్ అయిన న్యూక్లెయా ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘మనీ హెయిస్ట్ కు నేనో వీరా భిమానిని. అందుకే దీనికి పని చేయడం ఎంతో సరదాగా అనిపించింది.
ఈ సిరీస్ ను అభిమానించే వారెవరైనా నేను, మనం, అభిమానులంతా ఏమనుకుంటున్నారో దాన్నే ఈ పాట ప్రతిబింబిస్తుంది. ఈ వీడియోను షూట్ చేయడం ఎంతో అద్భుత అనుభవాన్ని అందించింది. ఇందులో కనిపించే గొప్ప గొప్ప కళాకారులంతా దానికి జీవం పోశారు. ఈ పాట అన్ని భాషల్లోనూ ఉంటుంది. దేశమం తటా అభిమానుల స్ఫూర్తిని వేడుక చేసుకునేలా ఉంటుంది. ఇక చివరిగా నేను చెప్పేది ఒక్కటే – మనీ హెయిస్ట్ – జల్దీ ఆవో’’ అని అన్నారు.
ఐకానిక్ స్పానిష్ సిరీస్ ఐదో భాగం హిందీ, తమిళం, తెలుగులలో లభ్యమవుతుంది. రెండు భాగాలుగా 2021 సెప్టెంబర్ 3న మరియు డిసెంబర్ 3న విడుదల అవుతుంది. అప్పటి వరకూ ….మనీ హెయిస్ట్ సీజన్ 5….దయచేసి త్వరగా రా….నెట్ ఫ్లిక్స్ ఇండియా నుంచి తాజా సమాచారం, అప్ డేట్స్ కోసం మమ్మల్ని IG @Netflix_IN, TW @NetflixIndia and FB @NetflixIndia పై ఫాలో అవ్వండి.
plz watch http://TTD | సెప్టెంబర్ మొదటి వారంలో భక్తులకు అందుబాటులో టిటిడి అగర బత్తులు