365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి 22,2025: సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు మార్గదర్శకు డైన దిగ్గజ దర్శకుడు ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ పై ప్రముఖ సినీ రచయిత పులగం చిన్నారాయణ, ఐఆర్‌టిఎస్ అధికారి రవి పాడి రచించిన ‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్’ పుస్తకం రెండో ఎడిషన్ విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. హిచ్‌కాక్ 125వ జయంతి సందర్భంగా, అలాగే ఆయన తొలి చిత్రం విడుదలై 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈ పుస్తకాన్ని రాశారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, “హిచ్‌కాక్ చిత్రాలు కొన్ని నేను కాలేజీ రోజుల్లో చూశాను. ఖాళీ సమయాల్లో ఈ పుస్తకాన్ని పూర్తిగా చదవాలని ఉత్సాహంగా ఉన్నాను. తెలుగు ప్రేక్షకులకు, సినీ అభిమానులకు ఇలాంటి గొప్ప రచన అందించిన పులగం చిన్నారాయణ, రవి పాడికి అభినందనలు. ప్రపంచ సినీ చరిత్రలో హిచ్‌కాక్ స్థానం ప్రత్యేకం. ఇలాంటి విలువైన రచనలు మరింత మంది సినీ ప్రేమికులకు చేరాలనేది నా ఆశ” అని తెలిపారు.
ఇది కూడా చదవండి.. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా.. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్..
ఇది కూడా చదవండి.. డిజిటల్ ఇండియా బిల్లు: అశ్లీల కంటెంట్‌ను అరికట్టడానికి రంగం సిద్ధం..
ఇది కూడా చదవండి.. డిజిటల్ ఇండియా చట్టం (డిఐఏ) అంటే ఏమిటి..? ఎందుకు..?
ఈ పుస్తకానికి ప్రముఖ నవలా రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముందుమాట రాశారు. మల్లాది వెంకట కృష్ణమూర్తి తన కెరీర్‌లో తొలిసారి ఓ పుస్తకాన్ని ప్రశంసిస్తూ ప్రత్యేక పాడ్‌కాస్ట్ కూడా విడుదల చేశారు.

45 మంది దర్శకులు, 7 మంది రచయితలు, 10 మంది జర్నలిస్టులు కలిసి 62 వ్యాసాలు రాసిన ఈ పుస్తకం సినిమాపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ మార్గదర్శిగా నిలుస్తుందనే అభిప్రాయాన్ని ప్రముఖులు వ్యక్తం చేశారు. ఇటీవల హైదరాబాద్ లిటరేచర్ ఫెస్టివల్ (HLF)లో బాలీవుడ్ నటుడు, దర్శకుడు అమోల్ పాలేకర్ కూడా ఈ పుస్తకాన్ని ప్రశంసించారు.
ప్రస్తుతం సినిమా ప్రేమికుల మధ్య హిచ్‌కాక్ పుస్తకం సంచలనంగా మారింది. మొదటి ఎడిషన్ పుస్తకాలు విడుదలైన ఐదు రోజులలోనే హాట్‌కేక్‌లా అమ్ముడైపోవడంతో రెండో ఎడిషన్ మరిన్ని విశేషాలతో విడుదలైంది.