365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఫిబ్రవరి 25, 2025 : గూగుల్ త్వరలో జీమెయిల్ లో టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (2FA) కోసం ఎస్ఎంఎస్ ఆధారిత విధానాన్ని తొలగించనుంది. తాజా సమాచారం ప్రకారం, గూగుల్ ఎస్ఎంఎస్ కోడ్స్‌కు బదులుగా క్యూఆర్ కోడ్స్ అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మార్పు, గూగుల్ ఖాతాల భద్రతను మరింత పెంచే కీలక నిర్ణయంగా భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి...ఘనంగా ‘ప్రేమకు జై’ ఫ్రీరిలీజ్ ఈవెంట్..
ఇది కూడా చదవండి...కేవలం 30 నిమిషాల్లో ఢిల్లీ-జైపూర్ ప్రయాణం! భారతదేశపు మొదటి హైపర్లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధం..
ఇది కూడా చదవండి...విడాకుల తర్వాత అనారోగ్యానికి గురైన ఏఆర్ రెహమాన్ మాజీ భార్య.. శస్త్రచికిత్స తర్వాత తన మాజీ భర్త కోసం పోస్ట్..
Google SMS ఆధారిత 2FAను ఎందుకు తొలగిస్తోంది?
ప్రస్తుతం Gmail లో లాగిన్ ప్రక్రియలో భాగంగా SMS ద్వారా 6-అంకెల కోడ్ పంపబడుతుంది. అయితే, సైబర్ నేరగాళ్లు ఫిషింగ్, సిమ్-స్వాపింగ్ వంటి పద్ధతుల ద్వారా ఈ కోడ్స్‌ను అపహరించే ప్రమాదం ఉంది. దీని వల్ల Google కొత్త భద్రతా విధానాన్ని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.
QR కోడ్ ఆధారిత 2FA ఎలా పనిచేస్తుంది?
SMS బదులుగా QR కోడ్ వస్తుంది..

స్మార్ట్‌ఫోన్ కెమెరా లేదా Google Authenticator వంటి యాప్ ద్వారా స్కాన్ చేయాల్సి ఉంటుంది. QR కోడ్ లాగిన్ ప్రాసెస్‌ను మరింత సురక్షితంగా చేస్తుంది. ఫిషింగ్ అండ్ సిమ్-స్వాపింగ్ దాడులను నివారించేందుకు ఇది సహాయపడుతుంది.
Google అధికారిక ప్రకటన..
Google ప్రతినిధి రాస్ రిచెన్‌డ్రాఫర్ మాట్లాడుతూ.. “ఎస్ ఎం ఎస్ కోడ్స్ సైబర్ దాడులకు ప్రధాన కారణమవుతున్నాయి. అందుకే, మేము వినియోగదారుల భద్రతను పెంచే కొత్త విధానాన్ని తీసుకువస్తున్నాము” అని తెలిపారు.
మరిన్ని భద్రతా మార్పులు వచ్చే అవకాశం..
Google ఇప్పటికే Time-Based One-Time Passwords (TOTP), Google Authenticator, మరియు స్మార్ట్‌ఫోన్ నోటిఫికేషన్‌ల ద్వారా లాగిన్ ప్రాసెస్ అందిస్తోంది. అయితే, ఫోన్ కాల్ ద్వారా కోడ్ రీసీవ్ చేసే ఎంపికను కూడా రద్దు చేసే అవకాశం ఉంది. ఈ మార్పులతో Google ఖాతాల భద్రత మరింతగా పెరగనుంది.