365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూలై 17,2022: వాట్సాప్ వినియోగదారులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సూపర్ ఫీచర్స్ ను అందించింది షార్ట్ మెసింజర్ యాప్ వాట్సాప్. ఫైల్ షేరింగ్ పరిమితిని 2GB కి పెంచింది. WhatsApp గ్రూప్ మెంబర్స్ పరిమితిని 256 నుంచి 512 మందికి విస్తరించింది. కొత్త ఫీచర్ అప్‌డేట్స్ ‘WhatsAppలో కమ్యూనిటీల’ కోసం WhatApp గ్రూప్ కి అనుగుణంగా ఉండ నున్నాయి. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తన ఫేస్‌బుక్ ఖాతాలో వాట్సాప్ ప్లాట్‌ఫామ్‌లో ఎమోజీలను ఉపయోగించి మెసేజ్ రియాక్షన్లను లాంచ్ గురించి ప్రకటించారు.
ఇటీవల మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ చాట్ లిస్ట్‌లలో వాట్సాప్ స్టేటస్ విజిబిలిటీ,32 మంది వాయిస్ కాల్, మల్టీ డివైజ్లలో ఒక ఖాతాను ఉపయోగించగల సామర్థ్యంతో సహా అనేక కొత్త ఫీచర్లను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారుల కోసం తాజా వాట్సాప్ వెర్షన్‌లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.
ఇప్పటివరకూ WhatsApp గ్రూప్ లో 256 మంది మెంబర్స్ మాత్రమే యాడ్ చేసేందుకు అవకాశం ఉండేది. కొత్త ఫీచర్ అందుబాటులోకి రావడంతో ఈ సంఖ్య రెట్టింపు చేయడం జరిగింది, ఈ అప్ డేట్ WhatsApp కమ్యూనిటీలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. 2GB ఫైల్ షేరింగ్ కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయడానికి వీలుంటుంది. ముఖ్యంగా ఫైల్ షేరింగ్ అనేది వ్యాపారా లు, విద్యాసంస్థలు, ఇతరులకు సులభంగా, సురక్షితంగా చేస్తుంది. కొత్త ఫీచర్లు iOS , Androidలో అందుబాటులో ఉంటాయి మరికొన్ని రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయి.