Tue. Dec 24th, 2024
children

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, నవంబర్ 13, 2022: కరోనా మహమ్మారి కారణంగా పెద్ద వాళ్ళు మాత్రమేకాదు చిన్నారుల్లోనూ తీవ్రప్రభావం చూపిస్తోంది. దీనివల్ల చిన్నారుల్లో చురుకుదనం తగ్గిపోయి, మానసికంగా కుంగి పోతున్నారట. చిన్నారుల్లో కరోనా తర్వాత మానసిక ఇబ్బందులు పెరుగు తున్నాయని, చాలామంది మానసికంగా దృఢంగా ఉండలేక పోతున్నారని సైకాలజిస్టులు చెబుతున్నారు.

చదువుపై శ్రద్ధ పెట్టలేక మానసికక్షోభకు గురవుతున్నారని పలు అధ్యయనాలు సైతం వెల్లడిస్తున్నాయి. రెండేళ్ల పాటు ఆన్‌లైన్ తరగతులు జరిగిన తర్వాత దేశంలోని పాఠశాలలు ఈ ఏడాదే తెరుచుకున్నాయి. అయితే.. దీని ప్రభావం ఇంకా పిల్లలపై ఇంకా కనిపిస్తూనే ఉందని స్కూల్ టీచర్స్, సైకాలజిస్టులు చెబుతున్నారు. కరోనా తర్వాత స్కూల్స్ కు వస్తున్న పిల్లలు మానసికంగా దృఢంగా లేరట.

children

ఆందోళన, భావోద్వేగం, నిరాశ వంటి సమస్యలతో పాఠశాలలకు హాజరవుతున్నారని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా మహమ్మారి కారణంగా తమ తల్లిగానీ తండ్రిని గానీ లేదా వారికీ మరింత దగ్గరగా ఉండే బంధువులను కోల్పోయిన విద్యార్థుల్లో ఆందోళన, నిరాశ వంటివి కనిపిస్తున్నాయట.

చిన్నారుల్లోనేకాదు, యువతలో కూడా మానసిక సమస్యలు కనిపిస్తు న్నాయి. రెండేళ్ల లో ఇంట్లో నుంచి ఎక్కువ సమయం బయటకు రాకపోవడం వల్ల చాలామంది మెంటల్ హెల్త్ పై తీవ్ర ప్రభావం కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబెర్స్ పిల్లలకు బలమైన శక్తులు అలాంటిది. వారి నుంచి కరోనా మహమ్మారి చాలామందికి దూరంగా ఉంచిందని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి(UNICEF) తెలిపింది.

ఇటీవల నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సంస్థ పాఠశాల పిల్లలలో మానసిక ఆరోగ్య సర్వేను అనుసరించి పాఠశాలకు వెళ్లే పిల్లలు, యువతలో మానసిక ఆరోగ్య సమస్యలను గుర్తించడానికి కొన్ని మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది.

children

పాఠశాలలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది, విద్యార్థులు అందరూ రోజులో మూడింట ఒక వంతు సమయాన్ని గడుపుతారు. పాఠశాలలు సంవత్సరానికి దాదాపు 220 రోజులు పనిచేస్తాయి. రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థి ఉండే సమయం మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పాఠశాలలు, హాస్టళ్లలోని పిల్లలందరికీ..సేఫ్టీ ,హెల్త్ పోషకాహారం అందించడం ఆయా పాఠశాలల బాధ్యతగా తీసుకోవాలని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT) మార్గదర్శకాలు జారీ చేసింది.

పాఠశాలల్లో చదివే పిల్లలను ఇతరుల పట్ల సానుభూతి చూపేలా, ఒత్తిడి, ఆందోళన సమయాల్లో ఒకరికొకరు సపోర్ట్ గా ఉండేలా అవగాహన కల్పించాలని, స్కూల్ కు వెళ్లే పిల్లలలో మానసిక ఆందోళన సమస్యను అరికట్టడానికి ఎలాంటి యంత్రాంగం లేదు. కాబట్టి వారికి ఇతరుల పట్ల సానుభూతితో మెలగడం వంటివి నేర్పించాలనిసైకాలజిస్ట్ లు చెబుతున్నారు.

children

కరోనా మహమ్మారి తర్వాత యువతలో ఆందోళన మరింతగా పెరిగిందని.. ఈ ఆందోళనకు చికిత్స చేయకపోతే తీవ్రమైన మానసిక అనారోగ్య సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. పలు అధ్యయనాలు సైతం యువతలో డిప్రెషన్, ఇతర మానసిక సమస్యల కేసులు చాలా రెట్లు పెరిగాయని తేల్చాయి.

ఏకాగ్రత కూడా చాలా తగ్గినట్లు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. దేశంలోని పాఠశాలల్లో కౌన్సెలింగ్ సెషన్స్ నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితిపై సున్నితంగా ఉండాలని, బాధిత పిల్లలను తిరిగి సాధారణ జీవితంలోకి, బయటి ప్రపంచంలోకి తీసుకురావడానికి కనీసం సంవత్సరం కంటే ఎక్కువ సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

error: Content is protected !!