Honda Cars India opens pre-launch bookings for upcoming New Amaze Honda Cars India opens pre-launch bookings for upcoming New Amaze
Honda Cars India opens pre-launch bookings for upcoming New Amaze
Honda Cars India opens pre-launch bookings for upcoming New Amaze

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, 5ఆగస్టు, 2021: భారతదేశంలో ప్రీమియం కార్ల ప్రముఖ తయారీదారు హోండా కార్స్ఇండియా లిమిటెడ్ (హెచ్ సీఐఎల్), కొత్త హోండా అమేజ్ ని 2021 ఆగస్ట్ 18నప్రారంభించనున్నది. కొత్త అమేజ్ కొత్త స్టైలిష్ రూపంతో, ఆకర్షణీయమైన ఎక్స్ టీరియర్ మార్పులు, పెంపొందించిన ఇంటీరియర్లతో లభిస్తోంది. రూ. 21,000 బుక్కింగ్ మొత్తంతో దేశంలో అన్ని అథీకృత హోండా డీలర్ షిప్స్ వద్ద కొత్త కార్ ప్రీ-బుక్కింగ్స్ ని కంపెనీ ఆరంభించింది. అదనంగా, రూ. 5,000 మొత్తంతో హెచ్ సీఐఎల్ వెబ్ సైట్ పై హోండా ఫ్రం హోం వేదిక ద్వారా తమ ఇంటి నుంచి కస్టమర్లు కార్ ని ఆన్ లైన్ లో కూడా బుక్ చేయవచ్చు. కొత్త అమేజ్ ప్రారంభోత్సవం గురించి మాట్లాడుతూ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్, మార్కెటింగ్ అండ్ సేల్స్, సీనియర్ వైస్ ప్రెసిండెట్, డైరక్టర్, రాజేష్ గోయల్, ఇలా అన్నారు.

Honda Cars India opens pre-launch bookings for upcoming New Amaze
Honda Cars India opens pre-launch bookings for upcoming New Amaze

“2013లో దీని ఆరంభం నుండి హోండా అమేజ్ 4.5 లక్షల మంది భారతీయ కస్టమర్ల హృదయాల్ని కొల్లగొట్టి భారతదేశంలో అత్యంతగా ప్రాధాన్యతనిచ్చేకుటుంబపు సిడాన్స్ లో ఒకటిగా చేసింది. ఈ నెల మధ్యలో ప్రారంభించే కొత్త అమేజ్ తో మోడల్ విజయగాథకి వేరొక అధ్యాయం చేర్చినందుకు మేము ఎంతో ఉద్వేగంగా ఉన్నాము. కొత్త అమేజ్ మరింత ప్రీమియంగా, స్టైలిష్ గా మరియు ఆధునికంగా మారింది. మేము పూర్తిగా పునరుత్తేజం చేసిన శ్రేణితో రాబోయే పండుగల సీజన్లోమేముసంప్రదించనున్నాం, మార్కెట్ లో తాజాఉత్తేజాన్ని కలగచేస్తామని ఆశిస్తున్నాం. ప్రస్తుతం తన 2వ తరంలో ఉన్న హోండా అమేజ్ హోండా వారి అతి పెద్ద విక్రయ మోడల్,భారతదేశంలో వివిధ కస్టమర్ల సంఖ్యని ఆనందిస్తోంది.

భారతీయ కస్టమర్లు ఎప్పటికీ తలెత్తే అవసరాలు, అభిలాషల్ని దృష్టిలో పెట్టుకొని మోడల్ తయారైంది. ఇది తమ ప్రస్ఫుటంగా కనిపించే డిజైన్, ఆధునిక ,విశాలమైన ఇంటీరియర్లు, సాటిలేనిడ్రైవింగ్ సామర్థ్యం, ఆధునిక ఫీచర్లు ,భద్రతా టెక్నాలజీలతో సిడాన్ అనుభవం కంటే ఒక తరగతి అధికంగా అందించే సమకాలీన,ప్రీమియం మోడల్ ఇది.హోండా అమేజ్ కి 1.5 లీ ఐ-డీటీఈసీ డీజిల్ ఇంజన్ ,1.2లీ ఐ-వీటెక్ పెట్రోల్ ఇంజన్ ల శక్తితో మేన్యువల్ గా,సీవీటీ వెర్షన్స్ లో రెండు ఇంధన ఆప్షన్స్ కోసం లభిస్తోంది.