kerala-man-gets-25cr-lottery

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరువనంతపురం,సెప్టెంబర్ 25, 2022: కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురానికి చెందిన ఆటో డ్రైవర్ అనూప్ ఈ ఏడాది ఓనం డ్రాలో రూ. 25 కోట్ల బంపర్ ప్రైజ్ ను గెలుచుకున్నాడు. తనకు లాటరీ ద్వారా అదృష్టం వరించిందను కున్నాడు. అయితే, ఒక వారం తర్వాత, అతను తన ప్రైజ్ మనీతో తన ఆర్ధిక సమస్యలను పరిష్కరించ డానికి ఉపయోగించాలనుకున్నాడు. ఈ విషయంలో కొంతమంది వ్యక్తుల కారణంగా కొత్త చిక్కులు వచ్చాయని, ముఖ్యంగా మనశ్శాంతి కోల్పోయానని 25 కోట్లరూపాయలు గెలుచుకున్న అనూప్ తెలిపాడు.

కోట్లరూపాయలు గెలుచుకున్న తర్వాత ఇతరుల అవసరాలను తీర్చాలని కోరుకునే వ్యక్తులు తనను నిరంతరం సంప్రదిస్తుండడంతో అతను ప్రశాంతతను కోల్పోయానని, తన సొంత ఇంట్లో కూడా పీస్ ఫుల్ గా ఉండలేకపోతున్నానని పేర్కొన్నాడు. ఓనం పండుగ సందర్భంగా కేరళ ప్రభుత్వం ప్రకటించిన లాటరీలో అనూప్‌కు ప్రథమ స్థానం లభించడంతో భారీ మొత్తంలో డబ్బు వచ్చింది. ఇకపాటి నుంచి కొత్తసమస్యలు మొదలయ్యాయి.

అనూప్ పన్నులు, ఇతర అప్పులను తీసివేయగా రూ.15 కోట్లు మిగిలింది. మంచి అవకాశాల కోసం మలేషియాకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో అదృష్టం తనను వరించింది. ఆప్రైజ్ మనీ తన అవసరాలు తీర్చుకోవడానికి, జీవితంలో ముందుకు సాగడానికి పనికొస్తుందనుకుని సంతోషపడ్డాడు అనూప్. కేరళ రాజధాని తిరువనంతపురానికి 12 మైళ్ల దూరంలో శ్రీకారియమ్ వద్ద, అనూప్ తన భార్య, బిడ్డ తల్లితో నివసి స్తున్నాడు. గెలిచిన తర్వాత తన కుటుంబానికి ఇల్లు కట్టించడమే తన తొలి లక్ష్యం అని ప్రకటించాడు అనూప్.