365తెలుగుడాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, సెప్టెంబర్ 23,2025 : ఎస్‌యూవీల తయారీలో దేశంలో పేరుపొందిన ఎంజీ మోటార్‌ (MG Motor)తమ మూడు ప్రముఖ మోడళ్లు – హెక్టార్‌, ఆస్టర్‌, గ్లోస్టర్‌ కార్ల కొత్త ధరలను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో విడుదల చేసింది. జీఎస్టీ రేట్ల తగ్గింపు నేపథ్యంలో వీటి ధరలను సవరించారు.

ఆన్‌రోడ్‌ ధరలు హైదరాబాద్‌, విజయవాడ (hyderabad, Vijayawada)వంటి ప్రధాన నగరాల్లో వేర్వేరుగా ఉన్నాయి. ఎక్స్‌షోరూం ధర, ఆర్టీవో రిజిస్ట్రేషన్‌, బీమా (ఇన్సూరెన్స్‌) వంటి వాటిని కలుపుకొని ఈ ధరలను నిర్ణయించారు.

ఎంజీ హెక్టార్‌ (MG Hector)..

హైదరాబాద్‌లో హెక్టార్‌ ఆన్‌రోడ్‌ ధరలు రూ. 17.03 లక్షల నుంచి రూ. 29.27 లక్షల వరకు ఉన్నాయి. దీని బేస్‌ మోడల్‌ ‘స్టైల్‌ 1.5L టర్బో పెట్రోల్‌’ ధర రూ. 17.03 లక్షలు కాగా, టాప్‌ మోడల్‌ ‘సావీ ప్రో 1.5 టర్బో సీవీటీ డ్యూయల్‌ టోన్‌’ ధర రూ. 29.27 లక్షలుగా ఉంది. విజయవాడలో హెక్టార్‌ ధరలు రూ. 17.75 లక్షల నుంచి మొదలవుతాయి.

ఎంజీ ఆస్టర్‌ (MG Astor)..

ఆస్టర్‌ ఆన్‌రోడ్‌ ధరలు హైదరాబాద్‌లో రూ. 11.54 లక్షల నుంచి రూ. 22.9 లక్షల మధ్య ఉన్నాయి.దీని బేస్‌ మోడల్‌ ‘స్ర్పింట్‌’ ధర సుమారు రూ. 12.0 లక్షలు. టాప్‌ మోడల్‌ ‘సావీ ప్రో సంగ్రియా టర్బో ఏటీ’ ధర రూ. 22.71 లక్షలు. విశాఖపట్నంలో ఈ కారు ధరలు రూ. 11.88 లక్షల నుంచి మొదలవుతాయి.

ఎంజీ గ్లోస్టర్‌ (MG Gloster)..

ఎంజీ గ్లోస్టర్‌ ఆన్‌రోడ్‌ ధరలు హైదరాబాద్‌లో రూ. 51.2 లక్షల నుంచి రూ. 57.6 లక్షల మధ్య ఉన్నాయి.ఈ కారు ‘షార్ప్‌ 7 ఎస్‌టీఆర్‌’ (Sharp 7 STR) బేస్‌ మోడల్‌ ధర రూ. 51.2 లక్షలు.’బ్లాక్‌స్టార్మ్‌ 4×4 6 ఎస్‌టీఆర్‌’ (Blackstorm 4×4 6 STR) టాప్‌ మోడల్‌ ధర రూ. 57.6 లక్షలుగా పేర్కొన్నారు.

గ్లోస్టర్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే లభిస్తుంది. ఈ ధరల వివరాలు, కారు మోడళ్ల గురించి పూర్తి సమాచారం కోసం సమీపంలోని ఎంజీ షోరూమ్‌లను సందర్శించవచ్చు. బీమా, రోడ్‌ ట్యాక్స్‌, ఇతర ఛార్జీల ఆధారంగా ఈ ధరలు మారే అవకాశం ఉంది.