365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జూలై 22,2022: వృద్ధుల సంక్షేమం కోసం కేంద్రం సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకానికి “ప్రధానమంత్రి వయ వందన యోజన (PMVVY) పెన్షన్ స్కీం”పేరు పెట్టారు.మార్చి 31, 2023 వరకు పొడిగించారు. ఈ పథకం కాలపరిమితి మార్చి 31, 2020తో ముగిసింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం దీనిని మరో మూడేళ్లు పొడిగించింది.
ప్రధానమంత్రి వయవంద యోజన పథకాన్ని 2023 మార్చి 31వ తేదీ వరకు పొడిగించారు. ప్రధాని వయ వందన యోజన పెన్షన్ పథకాన్ని31మార్చి 2023 వరకు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 7.40 శాతంగా నిర్ణయించింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతుంది. మిలిన షరతులు, పరిమితులన్నీ యథాతథంగా ఉంటాయి.
వయ వందన యోజన స్కీంను లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ఆఫర్ చేస్తోంది. పదేళ్ల పాటు నిర్ణీత రేటుకు పెన్షన్ చెల్లించే హామీని కలిగి ఉంటుంది. నామినీకి డెత్ బెనిఫిట్స్ ఉన్నాయి. 60 ఏళ్లు పైబడిన లేదా పదవీ విరమణ అనంతరం ఆదాయం గురించి చింత లేకుండా ఉండేందుకు కేంద్రం ఈ పథకాన్ని తీసుకు వచ్చింది. వృద్ధులకు ఆసరాగా నిలిచే పథకం ఇది. పదేళ్ల కాల పరిమితికి వర్తించే ఈ పథకంలో చేరే వృద్ధులు ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు.
ఈ పాలసీని కొనుగోలు చేయడానికి వయసు దృవీకరణ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డ్, బ్యాంకు వివరాలు తప్పనిసరిగా అవసరం. ఒక్కసారి ప్రీమియం చెల్లించి పాలసీని కొనుగోలు చేసే ఈ పథకంలో వడ్డీని 8.3 శాతంగా నిర్ణయించారు. నెలకు రూ.1000 నుంచి రూ.5000 వరకు పెన్సన్ అందుతుంది. అత్యవసర వైద్య సహాయానికి లేదా అరోగ్య సమస్యలకు డబ్బు అవసరమైనప్పుడు ఈ పాలసీని స్వాధీనపరిచి డబ్బు పొందే వీలు ఉంది. జీవిత భాగస్వామి అవసరాలకు కూడా ఈ పాలసీ ఉపయోగపడుతుంది.
మరింత సమాచారం కోసం… 022-67819281 లేద్ 022-67819290కి కాల్ చేయవచ్చి. టల్ ఫ్రీ నంబర్1800-227-717, ఇ-మెయిల్ ఐడి- onlinedmc@licindia.com వెబ్ సైట్ https://eterm.licindia.in/onlinePlansIndex/
pmvvymain.do సంప్రదించవచ్చు.