365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 27,2024: అదానీ లంచం కేసులో భారతీయ బిలియనీర్ గౌతమ్ అదానీ ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఎఫ్ సిపిఏ) ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి కంపెనీ వివరణ కూడా ఇచ్చింది. ఈ ఆరోపణలన్నీ నిరాధారమైనవని, అబద్ధమని కంపెనీ పేర్కొంది. ఈ మేరకు దేశంలోనే అతిపెద్ద న్యాయవాది మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
భారతీయ బిలియనీర్ గౌతమ్ అదానీపై ఇటీవల యూఎస్ ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద అభియోగాలు మోపారు. ఈ ఆరోపణ తర్వాత కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఇప్పుడు ఈ ఆరోపణలకు సంబంధించి కంపెనీ పెద్ద ప్రకటన విడుదల చేసింది. గౌతమ్ అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానీ, వినీత్ జైన్ ఎఫ్‌సిపిఎను ఉల్లంఘించినట్లు ఆరోపణలు లేవని కంపెనీ తన ప్రకటనలో తెలిపింది.
ఈ విషయమై మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కూడా మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ దేశంలోనే అతిపెద్ద న్యాయవాది. “నేను విషయాన్ని బేరీజు వేసుకున్నాను. గౌతమ్ అదానీ, అతని మేనల్లుడిపై ఈ ఆరోపణలేవీ లేవని” ముకుల్ రోహత్గీ తెలిపారు.