365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అమరావతి, జనవరి1,2023: ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్ లో నూతన సంవత్సర వేడుకలు ఆదివారం నిరాడంబరంగా జరిగాయి.
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతులకు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు శుభాకాంక్షలు తెలిపి ఆశీస్సులు తీసుకున్నారు.
దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యన్నారాయణ కుటుంబ సమేతంగా విచ్చేసి గవర్నర్ బిశ్వభూషణ్ హరించదన్ కు శుభాకాంక్షలు తెలిపారు.
తిరుమల తిరుపతి దేవస్ధానం, విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్ధానం పండితులు మంత్రోచ్ఛరణతో గవర్నర్ దంపతులను అశీర్వదించి శ్రీవారి ప్రసాదం, అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందించారు.
తిరుమల తిరుపతి దేవస్ధానం ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి గవర్నర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందించారు.
గవర్నర్ ను కలిసిన వారిలో శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్ధానం కార్యనిర్వహణ అధికారి భ్రమరాంబ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.